Oldest Homo Sapiens Footprints Discovered

Oldest Homo Sapiens Footprints Discovered | బయటపడిన పురాతన మానవుల పాదముద్రలు

న్యూ మెక్సికోలో ఉన్న ‘వైట్ సాండ్స్ నేషనల్ పార్క్‌’లో రీసెంట్ గా పురాతన మానవ పాదముద్రలను గుర్తించారు. ఈ పాలియో-మానవ పాదముద్రలు ఏ కాలానికి చెందినవా అని ఆరా తీయగా… అవి 23,000 నుండి 21,000 సంవత్సరాల నాటివని స్పష్టమవుతుంది. ఇవి మంచు యుగం కాలం నాటి అత్యంత శీతల భాగమైన ‘లాస్ట్ గ్లేసియల్ మ్యాగ్జిమమ్’కాలం నాటివి. 

13 వేల సంవత్సరాల క్రితం ఉత్తర అమెరికాకు వచ్చిన మొట్ట మొదటి మానవులు ‘క్లోవిస్ ప్రజలు’ అని పురావస్తు శాస్త్రవేత్తలు చెప్తుంటారు. ఈ క్లోవిస్‌ ప్రజలకంటే పూర్వం నివసించిన వారిపై పురావస్తు శాస్త్రవేత్తలు గతంలో కొన్ని ఆనవాళ్లను కనుగొన్నారు.  

అయితే వైట్ సాండ్స్ ట్రాక్‌వే ఉత్తర అమెరికాలో ఇప్పుడు క్లోవిస్ ప్రజల చరిత్రకు సంబంధించిన ప్రత్యక్ష సాక్ష్యంగా మారింది. దీంతో లాస్ట్ గ్లేసియల్ మ్యాగ్జిమమ్ కాలంలోనే క్లోవిస్‌ ప్రజలు ఇక్కడ ఉన్నారనడానికి బలమైన ఆధారాలు లభించినట్లు అయింది. ఇది మరింత లోతైన పరిశోధనకి  ఆజ్యం పోసినట్లు అయింది. 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top