Rizwan Visualised and Executed his Brilliant Inning

పక్కా ప్లానింగ్‌తో బరిలోకి దిగిన రిజ్వాన్…​ ఐసీసీ షాకింగ్ వీడియో రిలీజ్

యుద్దమైనా… ఆట అయినా… ఏదైనాసరే గెలవాలంటే పక్కా ప్రణాళిక ముఖ్యం. పోరు తలపెట్టేముందు నిరంతర సాధన కూడా ఉండాలి. సరిగ్గా రిజ్వాన్ అదే చేసి చూపించాడు.

చాలా కాలం తర్వాత టీ20 వరల్డ్ కప్ లో దాయాదులు బరిలోకి దిగారు. పాక్‌ని ఓడించి… విజయకేతనం ఎగరవేయాలని ఎన్నో ఆశలతో స్టేడియంలో అడుగుపెట్టింది టీమిండియా. కానీ, వీరి ఆశలన్నీ అడియాసలయ్యాయి. అంచనాలు తారుమారు అయ్యాయి. పాక్ గ్రాండ్ విక్టరీ కొట్టింది.  కేవలం ఒక్క వికెట్ కూడా కోల్పోకుండానే లక్ష్యాన్ని ఛేదించి ఘనవిజయాన్ని చాటింది.

ఇక ఓపెనర్లు కెప్టెన్ బాబర్ అజామ్, మహమ్మద్ రిజ్వాన్ చాలా క్లాస్ గా  ఇన్నింగ్స్ ఆడారు. హాఫ్ సెంచరీలతో ఇద్దరూ రెచ్చిపోయారు. వీళ్ళు ఆడినతీరు చూసి టీమిండియా సైతం మెచ్చుకోకుండా ఉండలేకపోయింది.

ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్​కు ముందే రిజ్వాన్​​ చేసిన మ్యాచ్ ప్రాక్టీస్ వీడియో​ ఇప్పుడు నెట్టింట వైరల్​ అయింది. ఇండియాతో జరగబోయే మ్యాచ్​ని ప్రెస్టీజియస్ గా తీసుకున్నాడో… ఏమో… కానీ మైదానంలో ఆడేటప్పుడు ఎలాంటి షాట్లు కొట్టాలో పక్కాగా ప్లాన్ చేసి పెట్టుకొన్నాడు. 

మ్యాచ్​ స్టార్ట్ అయ్యే ముందు వికెట్ల వెనకాల నిలబడి షాట్లు ఆడాడు. స్టార్ట్ అయిన తర్వాత బరిలో దిగి అదే షాట్లని మ్యాచ్​లో కొట్టాడు. తాజాగా ఈ వీడియోని ఐసీసీ పోస్ట్ చేసింది. అది కాస్తా వైరల్ గా మారింది.

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top