Storm Eunice Sweeps Europe

యూర‌ప్‌లో రోడ్డుపై ఎగిరిపోతున్న జనం (వీడియో

యూనిస్ తుఫాన్ ధాటికి బ్రిటన్ చిగురుటాకులా వణికిపోతుంది. ఇది వారం రోజుల వ్యవధిలో వచ్చిన రెండో తుఫాను కావడంతో…  అక్కడి ప్రజలంతా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని బతుకుతున్నారు. గంటకి 122 మైళ్ల వేగంతో వీచిన గాలుల ధాటికి ప్రజలు రోడ్లపై నడవలేక ఎగిరి పోతున్నారు.

ఇప్పటికే ఈ తుఫాన్ కారణంగా 9 మంది మరణించినట్లు తేలింది. సెంట్రల్ అట్లాంటిక్‌లో ఏర్పడిన యూనిస్ తుఫాను… యూరప్ వైపుకి దూసుకెళ్లి ప్రజల ప్రాణాలకి ముప్పు కలిగిస్తుంది.

ఇక ఈ తుఫాను కారణంగా సముద్ర తీరాల్లో అలలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. భీకర గాలుల ధాటికి విమానాలు గాల్లో షేక్ అవుతున్నాయి. ఇళ్ళు అయితే నీళ్ళపై పడవల్లా తేలుతున్నాయి. కార్లు నీళ్ళల్లో కొట్టుకుపోయాయి. ఇక మనుషులైతే రోడ్డుపైన ఎగిరి పోతున్నారు.

ఇంత విధ్వంశాన్ని సృష్టిస్తున్నందున ఎంతటి అత్యవసరమైనా బయటకి రావద్దని బ్రిటన్ ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేసింది. అలాగే, 436 విమాన సర్వీసులని తాత్కాలికంగా రద్దు చేసింది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top