Ukraine Russia Border Conflicts

ఉక్రెయిన్‌ రష్యాల మద్య మొదలైన దాడులు (వీడియో)

యుక్రెయిన్‌ సైన్యం, రష్యా అనుకూల వేర్పాటువాదుల మధ్య సరిహద్దు ప్రాంతంలో ఘర్షణలు మొదలయ్యాయి.  ఈ కారణంగా జరిగిన దాడుల్లో తూర్పు యుక్రెయిన్‌ ప్రాంతంలో ఓ ఆర్మీ జవాను మృతి చెందాడు.

తూర్పు ఉక్రెయిన్‌ లోని డొనెస్కీ ప్రాంతంలో… రష్యన్ వేర్పాటువాదులు ఘర్షణకి దిగారు. వారిని తరిమి కొట్టటం కోసం యుక్రెయిన్ ఆర్మీ కాల్పుల‌కు దిగింది. ఈ క్రమంలో  లాంచ‌ర్లు, గ్రనేడ్లు, మోర్టార్లు, యాంటీ ట్యాంక్ మిస్సైల్ సిస్టమ్స్‌తో విరుచుకుపడింది. ఆ సమయంలో రష్యా  ఫైరింగ్‌ చేస్తూ… ఉక్రెయిన్‌ ఆర్మీని అడ్డుకునేందుకు ప్రయత్నించింది.

ఈ ఘటనలో యుక్రెయిన్ కి చెందిన ఓ సైనికుడు మరణించాడు. కాల్పులు జరగటంతో అక్కడ పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. అందువల్ల అక్కడి ప్రజలంతా రష్యాకి తరలివెళ్తున్నారు. 

ఈ దాడుల వెనక రష్యా హస్తం ఉందంటోంది ఉక్రెయిన్. వేర్పాటువాదులు దాడులు చేసేలా… ఆ దేశమే ప్రోత్సహించిందని ఆరోపిస్తోంది. కానీ, రష్యా మాత్రం ఈ ఆరోపణలను కొట్టిపారేసింది. 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top