ప్రిన్స్ మహేష్ బాబు గారాలపట్టి సితార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, చిన్న వయసులోనే తన తండ్రినే మించి పోయింది. సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చిన తర్వాత తాను కూడా ఓ సెలబ్రిటీగా మారిపోయింది.
సోషల్ మీడియాలో సితారకి ఉన్న ఫాలోయింగ్ అంతా… ఇంతా… కాదు. తనలో ఓ పెయింటర్, సింగర్, డ్యాన్సర్ దాగి ఉన్నారని చెప్పే ఎన్నో ఉదాహరణలు నెటిజన్లతో పంచుకుంటూ ఉంటుంది.
ఇక అప్పుడప్పుడూ తనకి నచ్చిన పాటకి స్టెప్పులేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన అప్ కమింగ్ మూవీ సర్కారు వారి పాట. ఈ మూవీకి సంబంధించి ఇటీవల విడుదలైన ‘కళావతి’ సాంగ్ యూట్యూబ్లో ఓ రేంజ్ లో వ్యూస్ రాబట్టింది. వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజైన ఈ సాంగ్ కి మంచి రెస్పాన్సే వచ్చింది.
ఈ సాంగ్ కి డ్యాన్స్ అదరగొట్టింది సితార. ఆ వీడియోని తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు మహేష్. అంతేకాదు, “మై స్టార్… నన్ను బీట్ చేసింది” అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో తెగ వైరల్ అవుతుంది.
View this post on Instagram