Hidimbi, Bheema's demon wife, Mahabharata character

Uncovering the Story of Hidimbi, Bheema’s Demon Wife

మహాభారతం అంటే గొప్ప గొప్ప వీరులే కాదు, దీర వనితలు కూడా ఉన్నారు. వాళ్ళల్లో ఒక్కొక్కరూ ఒక్కో రకంగా కురుక్షేత్ర యుద్ధాన్ని ప్రభావితం చేశారు. అయితే, యుద్ధంతో కానీ, యుద్ధ ఫలితంతో కానీ సంబంధం లేకపోయినా… కేవలం ఒకే ఒక మహిళ మాత్రం తన వారసత్వాన్ని మొత్తం పణంగా పెట్టి, పాండవుల విజయానికి కారణమయింది. రాజ వైభోగాలున్నా వాటిని ఎప్పుడూ కోరుకోలేదు. ఒక సాధారణ మహిళగానే జీవనం సాగించింది. రాక్షస వంశంలో పుట్టినా… చివరికి దేవతగా మారి ఆరాధింప బడుతుంది. ఆమె ఎవరో…  భారతంలో ఆమెకున్న ప్రత్యేక స్థానం ఏమిటో… ఈ ఆర్టికల్ ద్వారా మనం తెలుసుకుందాం. 

ఈ రోజు మహాభారతంలో మనం చెప్పుకోబోయే ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ పేరు హిడింబి. ఈమెకే పల్లవి అనే మరో పేరు కూడా ఉంది. ఈమె పాండవులలో రెండవ వాడైన భీముని భార్య అని అందరికీ తెలిసిందే! సాదారణంగా ఈమె స్టోరీ గురించి కూడా చాలామందికి తెలుసు. కానీ, ఈమె పరోక్షంగా పాండవులకి ఎలా సహాయపడింది? వారి క్షేమం కోసం తన కొడుకుని, మనవడిని యుద్ధ రంగానికి ఎలా బలిచ్చింది? శ్రీకృష్ణుని కోసం ఆమె ఏం త్యాగం చేసింది? ఇలాంటి ఎన్నో రహశ్యాల గురించి తెలుసుకొనే ముందు అసలు భీముడు హిడింబిని కలవటానికి దారి తీసిన పరిస్థితుల గురించి సింపుల్ గా చెప్పుకుందాం. ఈ స్టోరీ మహాభారతంలోని ఆదిపర్వంలో 18 వ ఆశ్వాసంలో ఉంది. 

దుర్యోధనుని దురాలోచన

దుర్యోధనుడు కపట బుద్ధితో పాండవులని అంతమొందించాలని ఒక పధకం పన్నుతాడు. ఆ పధకం  ప్రకారం, వారణావతం అనే ప్రాంతంలోని లక్క ఇంటిలో పాండవులు నివసించేలా చేస్తాడు. ఆ లక్క ఇంటిని లక్క, మట్టి, నెయ్యి, మిశ్రమంతో నిర్మించేలా చేస్తాడు.  

హస్తినలో దుర్యోధనుని కుతంత్రం తెలుసుకున్న విదురుడు అసలు విషయం పాండవులకి తెలిసేలా చేస్తాడు. దీంతో ముందు జాగ్రత్తగా భీముడు ఒక సొరంగ మార్గాన్ని తవ్వుతాడు. ఊహించినట్లుగానే ఒకరోజు పాండవులంతా నిద్రిస్తున్న సమయంలో ఆ లక్క ఇంటిని తగలబెడతారు.  

అప్పుడు భీముడు తన తల్లి మరియు సోదరులందరినీ తన భుజాలపై ఎక్కించుకొని సొరంగ మార్గం గుండా ఒక అడవిలోకి తీసుకు వెళ్లి పడుకోబెడతాడు. తన వారంతా నిద్రిస్తూ ఉంటే… తాను మాత్రం నిద్ర మేల్కొని వారికి పహారా కాస్తూ ఉంటాడు. 

మనుషుల ఉనికిని పసిగట్టిన హిడింబ

ఆ అరణ్య ప్రాంతంలో హిడింబ, మరియు అతని సోదరియైన  హిడింబి అనే భయంకరమైన రాక్షసులు నివసిస్తూ ఉన్నారు. పాండవులు ఆ అడవిలోకి రావటంతో హిడింబ మనుషుల ఉనికిని పసిగట్టాడు. వెంటనే అతను తన సోదరి అయిన హిడింబిని పిలిచి, వారిని ఆకర్షించి, ఉచ్చులోకి లాగమని ఆదేశిస్తాడు. అప్పుడు వారందరినీ చంపి తినవచ్చని, ఈ రకంగా తమ ఆకలి తీర్చుకోవచ్చని చెప్తాడు. 

హిడింబి  భీముడిని కలవటం 

హిడింబి అయిష్టంగానే తన సోదరునికి విధేయత చూపి… సరస్సు వద్దకు వెళ్ళింది. అక్కడ నిద్రిస్తున్న పాండవులను చూసింది. ఆమె వాళ్ళ అందమైన రూపాలని మరియు గొప్ప ప్రకాశాన్ని చూసి ఆశ్చర్యపోయింది, ముఖ్యంగా వారందరిలో అత్యంత బలవంతుడు మరియు ధైర్యవంతుడు అయిన భీమునిది. 

ఆమె మొదటి చూపులోనే అతనితో ప్రేమలో పడింది. అంతేకాదు, అతనిని తన సోదరుడి బారి నుండి రక్షించుకో వాలని నిర్ణయించుకుంది. వెంటనే, హిడింబి ఒక అందమైన స్త్రీగా మారిపోయింది. భీముని దగ్గరకు వచ్చి మెల్లగా నిద్ర లేపింది. తన గురించి తాను పరిచయం చేసుకొంది. తాము రాక్షస జాతికి చెందిన వారిమని తాను, తన సోదరుడితో కలిసి ఈ అడవిలోనే నివసిస్తూ ఉన్నారని తెలిపింది. అంతేకాదు, తన సోదరుడు మిమ్మల్ని, మీ సోదరులందరినీ చంపాలని నిర్ణయించుకున్నాడని తెలిపింది. 

భీమునిపై తన ప్రేమని తెలియచేసిన హిడింబి

తన సోదరుడి ఆదేశం మేరకు ఇక్కడికి వచ్చానే కానీ, తనకు అలాంటి ఉద్దేశ్యమే లేదని, పైగా మిమల్ని రక్షించాలని ఉందని హిడింబి భీమునితో చెప్తుంది. అంతేకాక, తొలిచూపులోనే నాకు మీపై ప్రేమ కలిగిందని, నేను మిమ్మల్ని గాఢంగా ప్రేమిస్తున్నానని, పారిపోయి తనని పెళ్లి చేసుకోమని వేడుకుంది. 

ఆమె నిజాయితీకి భీముడు ఆశ్చర్యపోయాడు ఇంకా ఆమె పట్ల జాలిపడ్డాడు.  అయితే,  సోదరుడి బారి నుండి తనని  రక్షించడానికి అంగీకరించాడు. కానీ, తమ రాజ్యాన్ని తిరిగి పొందే వరకు తాను కానీ, తన సోదరులు కానీ బ్రహ్మచర్యం పాటిస్తామని ప్రతిజ్ఞ చేసి ఉన్నందున, ఆమెను వివాహం చేసుకోవడానికి నిరాకరిస్తాడు.

హిడింబి త్యాగం

భీమునిపై ప్రేమ తనకి ఆనందాన్ని ఇచ్చినా…  అతన్ని పొందటం కోసం సోదరునితో తన సంబంధాన్ని త్యాగం చేసింది. భీముని ఆశయాలు, మరియు బాధ్యతలు నెరవేర్చాలంటే, అతనని ముందుండి నడిపించాల్సిన బాధ్యత తనపై ఉందని తలిచింది.  అందుకోసం తన అన్న అడ్డు కాకూడదని భావించింది.  ఒక గొప్ప మంచి కోసం తన సోదరుడిని ఒదులుకోవటానికి కూడా సిద్ధపడింది. 

ఇది కూడా చదవండి: Mandodari’s Significance in Hindu Mythology

భీముడు మరియు హిడింబల మధ్య యుద్ధం

ఎంతసేపటికీ హిడింబి తిరిగి రాకపోవడంతో… హిడింబ తన సోదరిని వెతుక్కుంటూ వెళతాడు. దారిలో ఒకచోట తన సోదరి భీమునితో మాట్లాడుతూ ఉండటం చూస్తాడు. వెంటనే ఆవేశం ఆపుకోలేక “నేను నిన్ను ఆ మానవులని చంపడానికి పంపాను. కానీ నీవు అతనితో మాట్లాడుతున్నావు. ఇప్పుడే ఇక్కడే నీ కళ్ళముందే అతడిని నేనే చంపేస్తాను.” అంటూ భీమునిపై దాడికి దిగుతాడు హిడింబ. 

అయితే, భీముడు కూడా ఏం తీసిపోలేదు, అతనితో  ద్వంద్వ యుద్ధానికి సవాలు చేశాడు. ఇంకా అతని సోదరులకు గానీ, లేదా హిడింబికి గానీ హాని కలుగనివ్వను అని చెప్తాడు. భీముని మాటలకు హిడింబ మరింత ఆవేశంతో అతనిపై పూర్తి స్థాయిలో దాడిచేస్తాడు. 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top