Unrevealed Facts about Upapandavas

మహాభారతంలో పాండవులకు ఉన్న ప్రాముఖ్యత ఉపపాండవులకు ఉండదు. అభిమన్యుడు, ఘటోత్కచుడు వంటి వీరులకు దక్కిన ప్రాధాన్యత కూడా వీరికి దక్కలేదు. వీరిద్దరూ పాండవులకి ద్రౌపది వల్ల కాకుండా ఇతర భార్యల వల్ల కలిగిన సంతానం. అయినప్పటికీ కురుక్షేత్ర సంగ్రామంలో కీలక పాత్ర పోషించారు. ఇక ఉపపాండవులు  పాండవులకి ద్రౌపది వల్ల కలిగిన సంతానమే అయినప్పటికీ, పరాక్రమమంలో పాండవులంత వారే అయినప్పటికీ, కురుక్షేత్ర సంగ్రామంలో కీలక పాత్ర పోషించినప్పటికీ  కూడా వీరికి అంత ప్రాముఖ్యత లేదు. అది ఎందుకో..! పురాణాలు దాచిన ఈ ఉపపాండవుల జన్మ రహశ్యం ఏమిటో..! ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

సత్య హరిశ్చంద్రుని కథ మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. మహాభారతంలోని ఉపపాండవులకీ, సత్య హరిశ్చంద్రునికీ దగ్గరి సంబంధం ఉంది. ద్వాపర యుగం నాటి ఉపపాండవులకి, త్రేతా యుగం నాటి సత్య హరిశ్చంద్రులకీ లింక్ ఏమిటి? అసలు ఉపపాండవుల కథ  సత్య హరిశ్చంద్రుని కాలానికి ఎందుకు వెళ్ళింది? అనే డౌట్ మీకు వచ్చే ఉంటుంది. 

నిజానికి ఈ ఉపపాండవులనే వాళ్ళు హరిశ్చంద్రుని కాలానికి చెందినవాళ్ళే! శాపవశాత్తూ వీళ్ళు ద్వాపర యుగంలో పాండవుల పుత్రులుగా జన్మించవలసి వచ్చింది. ఆ శాపం కారణంగానే ఆయుష్షు తీరకుండానే అర్ధాంతరంగా జీవితాన్ని ముగించ వలసి వచ్చింది. వీరి శాపమేమిటో… వీరి జన్మ రహశ్యమేమిటో… తెలుసుకోవాలంటే వీరి పూర్వ జన్మ వృత్తాంతం గురించి చెప్పుకోవాల్సిందే!

పూర్వజన్మ వృత్తాంతం  

త్రేతాయుగంలో హరిశ్చంద్రుడు అనే గొప్ప రాజు ఉండేవాడు. అతను ఎంతో నిజాయితీపరుడు. ఎల్లప్పుడూ అతను తన రాజ్య ప్రజల క్షేమాన్నే కోరుకొనేవాడు. ప్రజలంతా ఇతని పాలనలో శాంతిని, సుఖ సంతోషాలని  అనుభవించేవారు. 

ఒకసారి అతను మహాబాహు అడవిలో వేటాడుతున్న సమయంలో అకస్మాత్తుగా ఒక స్త్రీ బిగ్గరగా కేకలు పెట్టటం విన్నాడు. ‘నన్ను రక్షించు! నన్ను కాపాడు!’ అంటూ ఇంకా కొంతమంది మహిళల రోదనలు కూడా వినిపించాయి. ఆ ఆర్తనాదాలు విన్న హరిశ్చంద్ర రాజు వారిని కాపాడేందుకు  ఆ దిశలో పరుగెత్తాడు. 

వాస్తవానికి ఆ కేకలు నిజమైనవి కావు, అడ్డంకులను సృష్టించే ప్రభువైన విఘ్నరాజు కల్పించిన భ్రమ. ఇక ఆ ఆర్తనాదాలు వినిపించే సమయంలో విశ్వామిత్ర మహర్షి ఆ అడవిలో తపస్సు చేసుకొంటూ ఉంటాడు. ఈసారి హరిశ్చంద్రుని నైపుణ్యాన్ని పరీక్షించడానికి, విఘ్నరాజు నేరుగా అతని శరీరంలోకే ప్రవేశిస్తాడు. వెంటనే సహనం కోల్పోయిన హరిశ్చంద్రుడు విశ్వామిత్రుడిని దుర్భాషలాడడం మొదలుపెడతాడు. 

హరిశ్చంద్రుని మాటల కారణంగా తన కఠోర తపస్సు భంగమై… అప్పటిదాకా తాను సంపాదించిన జ్ఞానమంతా  నాశనమవుతుంది. కోపంతో విశ్వామిత్రుడు శపించబోతాడు. విఘ్నరాజు తన శరీరం నుంచీ బయటికి వెళ్లి పోవటంతో తన తప్పు తెలుసుకున్న హరిశ్చంద్రుడు తనని క్షమించమని వేడుకుంటాడు. వెంటనే ఓ మహా ఋషి! ప్రజలను రక్షించడం నా కర్తవ్యం. దయతో నన్ను క్షమించు.. మీ ఆగ్రహం రాజుగా నా విధులపై తీవ్ర ప్రభావం చూపుతుంది అని ప్రాధేయ పడుతాడు. 

అందుకు విశ్వామిత్రుడు హరిశ్చంద్రుని నిజాయితీని పరీక్షించేందుకు గాను తాను పెట్టే పరీక్ష నెగ్గి చూపించమంది శపథం చేస్తాడు. హరిశ్చంద్రుడు దానికి అంగీకరిస్తాడు.

ఆ ప్రకారం, విశ్వామిత్రుడు అతడి కుటుంబాన్ని నానా కష్టాలూ పెడతాడు. వారి సంపదనంతా తీసుకోవడమే కాకుండా, రాజ్యం నుంచి కూడా వెళ్లగొట్టేస్తాడు. విశ్వామిత్రుని కఠినత్వానికి ముల్లోకాలు ఆశ్చర్య పోయాయి. దేవతలు సైతం ఏమీ చేయలేక చూస్తుండి పోయారు. 

కానీ, దేవలోకం నుంచి ఇదంతా గమనిస్తున్న ‘విశ్వులు’ అనే అయిదుగురు దేవతలు మాత్రం ఆయన్ని తప్పు పట్టారు. విశ్వామిత్రుని వంటి రాజర్షికి ఇలాంటి ప్రవర్తన తగదంటూ వాదించారు. వెంటనే కోపావేశంతో విశ్వామిత్రడు వారిని నరులుగా జన్మించమని శపిస్తాడు. 

భయపడిన విశ్వులు ఆయన్ని క్షమించమని వేడుకొంటారు. దీంతో విశ్వామిత్ర ముని వారిని మరుసటి జన్మలో ఎలాంటి భవబంధాలలోనూ చిక్కుకోకుండా మరణిస్తారని చెప్పి, కొంత ఉపశమనాన్ని కలిగిస్తాడు. అలా నరులుగా జన్మించిన ఆ విశ్వులే… ఈ ఉపపాండవులు. ఇప్పుడు మనం చెప్పుకొంటున్న ఈ ఉపపాండవుల కథ అలా  మొదలయింది.

ఉపపాండవులు ఎంతమంది? 

పాండవులలాగే ఉపపాండవులు కూడా అయిదుగురే! ఉప పాండవులు ద్రౌపదికి పాండవుల వల్ల కలిగిన సంతానం. వీరి పేర్లు వరుసగా – ప్రతివింధ్యుడు, శ్రుతసోముడు, శ్రుతకర్ముడు, శతానీకుడు, శ్రుతసేనుడు. 

ప్రతివింధ్యుడు

ఉపపాండవులలో మొదటివాడు మరియు ధర్మరాజుకీ ద్రౌపదికీ జన్మించినవాడు ప్రతివింధ్యుడు. ఇతను వింధ్యపర్వతానికి సాటి అయినవాడని చెప్తారు. అందుకే ఇతనికి ఆ పేరు వచ్చిందట. ప్రతివింధ్యుడికి శ్రుతవింధ్యుడనే పేరు కూడా ఉంది. కొన్ని జానపద కథలు ఆయనను చిత్రరథ గంధర్వుని అవతారంగా పేర్కొంటాయి.

ఇతను శిశువుగా ఉన్నప్పుడే ఏకచక్ర నగరిలో వదిలివేయబడతాడు. తరువాత యుధిష్ఠిరుడు చేసిన రాజసూయ యజ్ఞ ప్రచారంలో తన పిన తండ్రైన అర్జునుడితో యుద్ధం చేస్తాడు. ధర్మరాజు తనయుడు మరియు ఉపపాండవులలో పెద్దవాడు కాబట్టి, ఆయన తరువాత హస్తినాపురాన్ని ఏలే అర్హత కలిగినవాడు. 

మహాభారతం యొక్క ఇండోనేషియన్ వెర్షన్‌ లో, ప్రతివింధ్యుని కుమారుడు కలీంషాదుడు ధృతరాష్ట్రుని తరువాత హస్తినాపుర రాజుగా నియమింప బడతాడని మరియు కుంతిభోజుని కుటుంబానికి చెందిన యువరాణిని వివాహం చేసుకున్నాడని చెప్పబడింది. ఇంద్రప్రస్థం అతని సోదరి కొడుకు ద్వారా వారసత్వంగా పొందబడింది. 

Nakul Sahadev, the most underrated Pandava
Most Underrated Characters in Mahabharata

కురుక్షేత్ర యుద్ధ సమయానికి ఇతని వయస్సు 24 సంవత్సరాలు. ఆ సంగ్రామంలో అతను తన తండ్రి మరియు పినతండ్రులతో కలిసి పోరాడాడు. యుద్ధంలో 12వ రోజు తన తండ్రి ధర్మరాజును బంధించాలని ద్రోణుడు  ప్రయత్నిస్తాడు. ప్రతివింధ్యుడు వీరోచితంగా పోరాడి   అతని  ప్రయత్నాలన్నిటినీ తిప్పికొడతాడు. 14వ రోజు సుతసోమునితో పాటు కౌరవులలో కొందరితో యుద్ధం చేశాడు. ఇక 15వ రోజున కర్ణుని కొడుకైన చిత్రసేనుడిని సంహరిస్తాడు. 16వ రోజున అభిసర రాజు చిత్రను చంపాడు.

ఇదికూడా చదవండి:Uncovering the Mysteries of Krishna’s Mahasamadhi

శతానీకుడు

ఉపపాండవులలో రెండోవాడు మరియు నకులునికీ, ద్రౌపదికీ పుట్టినవాడు శతానీకుడు. కురు వంశానికి చెందిన ఒక ప్రసిద్ధ రాజర్షి పేరు ఇతనికి పెట్టారు. అంతేకాక, ఇతనిని విశ్వదేవుని అవతారంగా కూడా పరిగణిస్తారు.

పాండురాజుకి కుంతీదేవి, మాద్రి  ఇద్దరు భార్యలు అన్న విషయం తెలిసిందే!  ద్రౌపది తన మొదటి సంతానం కుంతీదేవి కుమారులలో పెద్దవాడైన ధర్మారాజు వల్ల కలుగుతుంది. ఇక రెండో సంతానం మాద్రి పెద్ద కుమారుడైన నకులుని వల్ల కలుగుతుంది. అందుకని శతానీకుడు ఉపపాండవులలో రెండోవాడయ్యాడు. 

ఆ పెద్దరికంతోనూ, పరాక్రమంతోనూ కురుక్షేత్ర సంగ్రామంలో తన సోదరుడు ప్రతివింధ్యతో పాటు తానుకూడా పాండవ వీరుడు దృష్టద్యుమ్నుని సేనకు నాయకత్వం వహించాడు. ఇతను యుద్ధంలో కౌరవ మిత్రుడైన భూతకర్మ సైన్యాన్ని, అలాగే భూతకర్మను ఊచకోత కోశాడు.

6వ రోజు కౌరవ యువరాజు దుష్కర్ణుని కూడా ఓడించాడు. 11వ రోజు కర్ణుని కొడుకు వృహసేనుడి చేతిలో ఓడిపోయాడు. కౌరవుల్లో జయత్సేను, చిత్రసేనుడు మరియు శ్రుతకర్మను ఓడించి కళింగ యువరాజును చంపాడు. 17వ రోజు కూడా కౌరవ సైన్యాన్ని విపరీతంగా నాశనం చేశాడు.

శ్రుతసోముడు

ఉపపాండవులలో మూడవవాడు మరియు భీమసేనుడికీ, ద్రౌపదికీ జన్మించినవాడు శ్రుతసోముడు. 

పాండవులలోకెల్లా భీకరంగా పోరాడే వీరునిగా పేరుగాంచాడు. అందుకే అర్జునుడికి సైతం ఇతనంటే ఎంతో ఇష్టం. ఆ ఇష్టంతోనే అర్జునుడు ఇతనికి విల్లు మరియు రథానికి గుర్రాలను ఇచ్చాడు. 

ఇతను గొప్ప ధైర్యవంతుడు మరియు ప్రతిభావంతుడైన యోధుడు కూడా. కురుక్షేత్ర యుద్ధంలో మొదటి రోజున కౌరవ యువరాజు వికర్ణతో యుద్ధం చేసాడు. శకునిని దాదాపు చంపినంత పని చేయడం ద్వారా ఇతను యుద్ధంలో ప్రధాన పాత్ర పోషించాడు. 12వ రోజున, ద్రోణాచార్యుని వైపు పరాక్రమశాలి అయిన కౌరవ వివిస్మతి ముందుకు రాకుండా అడ్డుకున్నాడు. 

అతను తన సవతి సోదరుడు ప్రతివింధ్యతో కలిసి 14వ రోజు రాత్రి కౌరవులలో కొందరితో యుద్ధం చేశాడు. 15వ రోజున అశ్వత్థామ మరియు ద్రోణులను పట్టుకోవడంలో యుధిష్ఠిరుడు మరియు ఇతర ఉపపాండవులతో కలిసి అతను ప్రధాన పాత్ర పోషించాడు. 

శ్రుతసేనుడు

ఉపపాండవులలో నాల్గవవాడు మరియు సహదేవునితో ద్రౌపదికి జన్మించినవాడు శ్రుతసేనుడు. శ్రుతసేన అంటే  గొప్ప సేనలను కలిగినవాడు అని అర్థం. 

ఇతను తన తండ్రిలాగే చాలా తెలివైనవాడు. కురుక్షేత్ర యుద్ధంలో అభిమన్యుడిని చంపిన దుశ్శన కుమారుడిని చంపి ప్రతీకారం తీర్చుకుంటాడు. అలాగే, భూరిశ్రవస్ యొక్క తమ్ముడు శాలను కూడా చంపుతాడు. దుష్మనర మరియు దుర్ముఖ వంటి ఇతర యోధులతో పోరాడి వారిని ఓడించాడు. కౌరవ యోధుడైన దేవవ్రద్ధ కుమారుడిని కూడా చంపాడు.

శ్రుతకర్ముడు

ఉపపాండవులలో ఐదవవాడు మరియు అర్జునుడితో ద్రౌపదికి జన్మించిన కుమారుడు శ్రుతకర్ముడు. ఇతను ఉపపాండవులలో అందరికంటే చిన్నవాడు మరియు  అతి గారాబంగా పెరిగినవాడు. 

యుద్ధ సమయంలో ఇతను చాలా చిన్నవాడు, కానీ అతని వయస్సు అనుభవం ముందు తలదించింది. ఇతను తన తండ్రి వలె సమర్థుడైన విలుకాడు కూడా. కాంభోజ పాలకుడైన సుదక్షిణను మొదటి రోజే ఓడించాడు. 6వ రోజున కౌరవ జయత్సేనుడిని కూడా ఓడిస్తాడు. 16వ రోజున అభిసర రాజు చిత్రసేనుని చంపాడు. 

ఇతని యుద్ధ నైపుణ్యం దుశ్శాసనుడు మరియు అశ్వథామ వంటి కఠినమైన యోధులను సైతం ఎదుర్కొనేలా చేసింది. పరోక్షంగా  చూస్తే ఈయన ఖచ్చితంగా అర్జునుడి సాహసాల నుండి పుట్టిన వీరునిలా అనిపిస్తుంది. అతని రథంలోని గుర్రాలు కింగ్‌ఫిషర్ల రంగును కలిగి ఉంటాయట. 

The Untold Story of Barbarik in Mahabharata
The Unknown Story of Barbarik in Mahabharata

ఇదికూడా చదవండి:Philosophical Significance of Ashta Vakra Katha

ఉపపాండవుల మరణం 

తన స్నేహితుడు దుర్యోధనుడి మరణం మరియు యుద్ధం చివరి రోజున కౌరవుల ఓటమి తర్వాత చాలా నిరుత్సాహపడి, విసిగిపోతాడు అశ్వథామ. తన తండ్రైన ద్రోణునికి అబద్ధం చెప్పి, ఆయనతో అస్త్ర సన్యాసం చేయించి, పాండవులు ఆయనను అన్యాయంగా పొట్టనపెట్టుకున్నారన్న ఆవేశంతో రగిలిపోతాడు. 

ఒక పెద్ద చెట్టు కింద కూర్చుని ఈ విషయమై తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటాడు. పగటిపూట తనపై దాడి చేసిన కాకుల మీద రాత్రిపూట గుడ్లగూబ దాడి చేయడాన్ని చూస్తాడు. వెంటనే అతనికి ఆరోజు రాత్రి పాండవులపై దాడి చేయాలనే ఆలోచన వస్తుంది. అతను దీనిని ఒక సంకేతంగా భావించి, తన బాధకు కారణమైన పాండవుల మరణం మరియు పతనానికి ప్రణాళికలు రూపొందించడం ప్రారంభిస్తాడు.

తన పగకు ప్రతీకారంగా పాండవులను సమూలంగా నాశనం చేస్తానని ప్రతిజ్ఞ పూని బయలుదేరతాడు. పాండవులను ఎలాగైనా చంపాలన్న కసితో రగిలిపోతున్న అశ్వత్థామ యుద్ధనీతిని సైతం పక్కనపెట్టి రాత్రివేళ వారిని చంపాలనుకుంటాడు. 

వెంటనే కౌరవుల పక్షాన మిగిలి ఉన్న చివరి యోధులైన కృతవర్మ మరియు కృపాచార్యను పిలుస్తాడు. యుద్ధం యొక్క చివరి రోజు అంటే 18వ రోజు రాత్రి పాండవ శిబిరంపై వీరు ముగ్గురూ మూకుమ్మడిగా దాడి చేస్తారు. కృతవర్మ మరియు కృపాచార్యని శిబిరం యొక్క ప్రవేశ ద్వారం వద్ద నియమిస్తాడు. 

శిబిరం లోపల నిద్రిస్తున్న శిఖండి మరియు దృష్టద్యుమ్నుడు వంటి నైపుణ్యం కలిగిన యోధులను నిద్రిస్తున్న సమయంలోనే చంపేస్తాడు. అశ్వథామ యొక్క కోపానికి భయపడి పారిపోవడానికి ప్రయత్నించిన వారిని కృతవర్మ మరియు కృపాచార్య నరికి చంపుతారు.

ఇక మిగిలిన వాళ్ళలో చీకటిలో నిద్రిస్తున్న ఐదుగురిని గుర్తిస్తాడు. ఆ వ్యక్తులను చూసి, పాండవులే అనుకొని, వారిని నిర్దాక్షిణ్యంగా హతమారుస్తాడు. కానీ అక్కడ పాండవులకు బదులు ఉపపాండవులు నిద్రిస్తున్నారని, అతను అనుకోకుండా వారిని చంపాడని తరువాత తెలుసుకొంటాడు. 

అలా మహాభారతంలో ఉపపాండవుల కథ ముగుస్తుంది. ఉపపాండవులను అకారణంగా, అన్యాయంగా, అధర్మంగా పొట్టన పెట్టుకున్నందుకు చిరకాలం రోగాలతో జీవచ్ఛవంగా బతకమన్న కృష్ణుని శాపాన్ని పొందుతాడు అశ్వత్థామ.

ఈ విధంగా, ఈ ఐదుగురు విశ్వ దేవతలు ప్రతివింధ్య, సుతసోమ, శ్రుతకర్మ, శతానిక మరియు శ్రుతసేన అనే ఐదుగురు ఉపపాండవులుగా జన్మించారు. విశ్వామిత్రుడు ఇచ్చిన శాపం కారణంగా వారు అశ్వథామచే చంపబడ్డారు, మరియు వారు స్వర్గలోకానికి తిరిగి వెళ్లి, వారి మరణానంతరం మళ్లీ విశ్వదేవతలుగా మారారు.

ఉపపాండవుల కథ ఇక్కడితో ముగియలేదు. వారి కథలోని అత్యంత ఆసక్తికరమైన అంశం చాలా సంవత్సరాల క్రితం పాండవులు లేదా కౌరవులు పుట్టడానికి ఒక యుగానికి  ముందే ప్రారంభమయిందని త్రేతా యుగంలో హరిశ్చంద్రుని కథ మనకి తెలియచేస్తుంది.

నీతి 

మహాభారతం ఒక హిందూ ఇతిహాసం, ఇది చెడుపై మంచి ఎల్లప్పుడూ విజయం సాధిస్తుందనే నైతికతను బోధిస్తుంది. పాండవులు మరియు కౌరవులు అనే దాయాదులిద్దరూ  రెండు సమూహాలుగా విడిపోయి అధికారం మరియు రాజ్య పాలన కోసం పోరాడే కథ. నిజాయతీగా జీవించడం, హక్కుల కోసం పోరాడడం కథలోని నైతికత. 

ఇక ఉపపాండవులు ద్రౌపది మరియు పంచ పాండవులకి ఐదుగురు కుమారులు మాత్రమే కాదు, నిజాయతీకి పంచ ప్రాణాలు కూడా! అందుకే వీళ్ళు అకాల మరణం చెందినా… అంతులేని కీర్తిని గడించారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top