Which Comes First the Chicken or the Egg

కోడి ముందా..? గుడ్డు ముందా..? ఆన్సర్ దొరికేసిందోచ్… (వీడియో)

కోడి ముందా..? గుడ్డు ముందా..? తరతరాలుగా వీడని చిక్కు ప్రశ్న ఇది. ఎవరినైనా ఈ ప్రశ్న అడగితే… సరదాగా ఆటపట్టించడానికి అడుగుతున్నారు అనుకొని సిల్లీగా తీసేస్తారు. కానీ, ఇదో జవాబు లేని ప్రశ్న. 

చిన్నతనంలో మనమంతా మన ఫ్రెండ్స్ ని, తెలిసినవాళ్ళని ఈ ప్రశ్న అడిగి సరదాగా ఆటపట్టించిన వాళ్ళమే! కానీ, ఇప్పటికీ మన దగ్గర కూడా దీనికి జవాబు లేదు. ఆ విషయాన్ని ఒప్పుకోకుండా ఆ… ఇదొక అర్థం లేని ప్రశ్నలే! అని కొట్టిపారేశాం. మనమైతే ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోలేదు కానీ, అమెరికాలోని ఓ జర్నలిస్ట్ మాత్రం ఎలాగైనా దీనికి  సమాధానం కనుక్కోవాలని ప్రయత్నించి సక్సెస్ అయ్యాడు. 

‘రాబర్ట్ క్రుల్విచ్’ అనే ఓ అమెరికన్ జర్నలిస్ట్ గత కొంతకాలంగా దీనిపై రీసర్చ్ చేసి ఈ ప్రశ్నకు సమాధానం కనుక్కొన్నాడు. ఆ విషయాన్ని తన జర్నల్‌లో ప్రచురించారట. 

అయితే, ఈ ప్రశ్న వెనుక ఒక చిన్న స్టోరీయే ఉంది. చాలా సంవత్సరాల  క్రితం ఈ భూమిపై అసలు కోళ్లనేవే ఉండేవి కాదట. వాటికి బదులుగా అచ్చం కొళ్ల మాదిరిగానే ఉండే పెద్ద సైజు పక్షులు ఉండేవట. వాటిని ‘ప్రోటో కోడి’ అంటారట. ఆ ప్రోటో కోళ్ల జీన్స్ మార్పిడి చేయటం వల్ల అవి ఇప్పటి కోళ్ల రూపంలోకి వచ్చేసాయట. ఇప్పుడున్న కోళ్లు పుట్టక ముందే ప్రోటో కోళ్లు పెట్టిన గుడ్లు ప్రపంచంలో అందుబాటులోకి వచ్చాయి. కాబట్టి గుడ్డే ముందు. 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top