Sonu Sood Supporting Singer Sreerama Chandra in Bigg Boss Telugu Season 5

బిగ్‏బాస్‏లో నా సపోర్ట్ అతనికే అంటున్న సోనూసూద్… వైరల్ అవుతున్న వీడియో

స్మాల్ స్క్రీన్ బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్‏బాస్‏. ఈ షోలో ప్రస్తుతం సీజన్ 5 విజయవంతంగా నడుస్తుంది. దీంతో బుల్లితెర ప్రేక్షకులు మాత్రమే కాకుండా… సినీ సెలెబ్రిటీలు కూడా వీక్షిస్తుంటారు. ఈ నేపధ్యంలో  కంటెస్టెంట్స్ కి కొందరు సెలెబ్రిటీలు తమ మద్దతుని కూడా తెలియచేసిన సందర్భాలు ఉన్నాయి. 

ఇక ఈ సీజన్ లో ఇంతకుముందు ఒకసారి ట్రాన్స్‏జెండర్ ప్రియాంకకే తన మద్దతు అని మెగా బ్రదర్ నాగబాబు ప్రకటించారు. ఇక తాజాగా ఆల్ ఇండియా రియల్ హీరో సోనూసూద్ కూడా అదే బాట పట్టారు. అడిగినవారికే కాదు, అడగని వారికి కూడా తనకి చేతనైన సాయం చేస్తున్న ఈ రియల్ హీరో… ఇప్పుడు అడగకుండానే ఓ కంటెస్టెంట్ కి తన సపోర్ట్ అందించారు. 

ఈ సీజన్‏లో పాల్గొన్న సింగర్ శ్రీరామ్ చంద్రని నేను సపోర్ట్ చేస్తున్నానని తెలిపారు. ఈ మేరకు ఆయన ఇన్‏స్టాలో ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అయింది.  బిగ్‏బాస్‏ తెలుగు సీజన్ 5లో శ్రీరామచంద్రని చూస్తున్నారా? నేను చూస్తున్నాను. షోలో నా బెస్ట్ నువ్వే శ్రీరామ్ అంటూ కామెంట్ చేశారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top