Never Donate these 6 Items in your Life!

ఈ 6 వస్తువులను జీవితంలో ఎప్పుటికీ దానం చేయకండి!

అన్ని మతాలలోనూ ఉన్న ఒకే ఒక గొప్ప గుణం ‘దానగుణం’. అందుకే మన పూర్వికులు దానానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. సనాతన ధర్మం ప్రకారం, సత్యయుగంలో తపస్సు, త్రేతాయుగంలో జ్ఞానం, ద్వాపరయుగంలో యాగం, మరియు కలియుగంలో దానధర్మాలు మాత్రమే మనిషికి మేలు చేయగలవని చెప్పబడింది. అందుకే ప్రతి వ్యక్తి తమ జీవితంలో దానం చేస్తూనే ఉండాలి.

అయితే, దానం చేసేటప్పుడు ఏమీ ఆశించకుండా… కేవలం భక్తితో మాత్రమే చేయాలి. అప్పుడే మనం చేసే దానానికి గొప్ప ఫలితం ఉంటుంది. వాస్తవానికి ఈ దానం చేయటంలో కూడా కొన్ని పద్దతులు  ఉంటాయి. కొన్ని రకాల వస్తువులను మనం ఎప్పటికీ దానం చేయకూడదు. ఒకవేళ అలా చేస్తే… జీవితంలో చాలా కోల్పోవాల్సి వస్తుంది. ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

  1. అన్నదానానికి మించిన దానం మరొకటి లేదంటారు. ఈ దానం చేయటం వల్ల మన జీవితం సుఖ సంతోషాలతో వర్ద్ధిల్లుతుంది. కానీ, అన్నదానం చేసే వారు ఎప్పుడూ చెడి పోయిన ఆహారం మాత్రం ఎవరికీ దానం ఇవ్వకూడదు. అలా చేస్తే మీ జీవితం కూడా చెడిపోతుంది.
  2. స్టీల్ మరియు ఇత్తడి పాత్రలను ఎప్పుడూ దానం చేయకూడదు. అలా చేస్తే మీ కుటుంబంలో ఆనందాన్ని దూరం చేసుకున్న వారు అవుతారు. 
  3. పుస్తకాలు కానీ,  గ్రంథాలు కానీ స్వచమైనవిగా ఉంటాయి. అందుకే, మీరు వాడి పడేసిన, లేదా చిరిగిపోయిన పుస్తకాలు, లేదా గ్రంధాలు అస్సలు దానం చేయవద్దు.
  4. కొంతమంది నూనెని దానం ఇస్తుంటారు. అదికూడా శనివారం పూటే ఇస్తుంటారు. అయితే ఈ దానం చేసేటప్పుడు ఎట్టిపరిస్థితుల్లోనూ  మీరు వాడిన నూనెను ఇతరులకు ఇవ్వకూడదు. అలా ఇస్తే మీరు కష్టాల పాలు అవుతారు.
  5. పొరపాటుగా కూడా చీపురును ఇతరులకు దానంగా ఇవ్వకండి. ఎందుకంటే, చీపురుని  లక్ష్మీదేవీ స్వరూపంగా భావిస్తారు. అందుకే చీపురు మన ఇంటి దరిద్రాన్ని, మరియు పేదరికాన్ని దూరం చేస్తుంది. అలాంటప్పుడు ఆ చీపురునే దానం చేస్తే!  ఆర్ధిక సమస్యలు ఏర్పడి… అప్పుల పాలై… ఇబ్బందులు పడతారు.
  6.  ఇక ఫైనల్ గా ప్లాస్టిక్ ని అస్సలు దానం చేయకండి. వీలైనంత వరకు దానిని నివారించటం బెటర్. ప్లాస్టిక్ వస్తూవులని దానం చేస్తే… కుటుంబ కలహాలు పెరిగి ఆ ఇంట్లో అశాంతి ఏర్పడుతుంది. 

సో, మై డియర్ ఫ్రెండ్స్..! మీరు ఏదైనా దానం ఇచ్చేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి. ఈ పైన చెప్పిన 6 వస్తువులలో ఏవైనా ఉన్నట్లయితే, వెంటనే దానం చేయటం ఆపేయండి. దాని బదులు మరేదైనా మీ తాహతుకు తగ్గ వస్తువుని ఎంచుకోండి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top