దీపావళి పండుగ వస్తుందంటే చాలు, నెల రోజుల ముందు నుంచే సందడి మొదలవుతుంది. ఇక పిల్లలయితే, ఈ సమయంలో చాలా బిజీగా ఉంటారు. ఎక్కడ చూసినా గ్రూపులుగా చేరి టపాసులు కాలుస్తూ ఖుషీగా ఉంటారు. అయితే, ఆనందం ఒక్కటే కాదు, చాలా జాగ్రత్తగా కూడా ఉంటూ ఉండాలి. లేదంటే, ప్రమాదాలు జరగవచ్చు.
గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన చిన్నారులు దీపావళికి పది రోజుల ముందు నుంచే టపాసులను కాల్చడం మొదలుపెట్టారు. ఈ నేపధ్యంలో ఇంటి గేటు ముందు ఒక మ్యాన్ హోల్ ఉంది. ఆ మ్యాన్ హోల్ రంధ్రాల్లో టపాసులు వేసి కాలిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన వచ్చింది వీరికి.
ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఒక అగ్గిపుల్ల అంటించి… ఆ మ్యాన్ హోల్ లో వేశారు. అంతే ఒక్కసారిగా దానినుండి మంటలు పైకి ఎగిశాయి. మంటలు పైకి రాగానే వారంతా తలో దిక్కు పరిగెత్తారు. ఎట్టకేలకి వీరంతా స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వారందరినీ హాస్పిటల్‌లో చేర్పించి… చికిత్స అందించారు.
అయితే, ఆ ప్రాంతంలో అండర్‌గ్రౌండ్ గ్యాస్ పైప్ లైన్స్ పనులు జరుగుతున్నాయట. గ్యాస్ పైప్ లైన్ డ్యామేజీ అవడంతోనే మ్యాన్ హోల్ నుంచి మంటలు చెలరేగినట్లు స్పష్టమైంది. ఈ దృశ్యమంతా సీసీకెమెరాలో రికార్డయ్యాయి.
కాబట్టి దీపావళి సందర్భంగా టపాసులు కాల్చేటప్పుడు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా… ప్రాణానికే ప్రమాదం. ముఖ్యంగా చిన్న పిల్లలైతే మరింత జాగ్రత్త అవసరం.
Modi’s ‘gutter se gas’ discovery proved right in #Surat
No need of petrol-diesel now.🔥#CRACKERS #Fireinguttur pic.twitter.com/4gVISEYkBs
— Ira (@Shayarcasm) October 28, 2021