ఆస్కార్ సాలా ఎవరు? గూగుల్ డూడుల్ అతని బర్త్ డేని ఎందుకు సెలెబ్రేట్ చేస్తుంది?

ఈరోజు ఎలక్ట్రానిక్ మ్యూజిక్ కంపోజర్, మరియు ఫిజీసిస్ట్ అయిన ఆస్కార్ సాలా 112వ జయంతి. ఈ సందర్భంగా గూగుల్‌ డూడుల్‌తో నివాళి ఇచ్చింది. 

1910లో జర్మనీలోని గ్రీజ్‌లో జన్మించిన ఆస్కార్‌ సాలా యొక్క తల్లి  ఓ సింగర్. తండ్రి కూడా మ్యూజిక్ ఎక్స్ పర్ట్ అంతేకాదు, ఆయన ఓ కంటి డాక్టర్‌ కూడా. ఇలా చిన్నతనం నుండీ సంగీతంలోనే పుట్టి పెరిగారు ఆస్కార్‌ సాలా. అందుకే, చైల్డ్ హుడ్ డేస్ నుండే పియానో వాయిస్తూ కన్సెర్ట్‌లు ఇచ్చేవారు. 14 ఏళ్ళ వయసులోనే, సాలా వయోలిన్ మరియు పియానో ​​వంటి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ కోసం కంపోజిషన్లు, మరియు సాంగ్స్ ని క్రియేట్ చేసేవారు. బెర్లిన్‌కు చెందిన వయోలిస్ట్‌ అయిన పాల్‌ హిందెమిత్‌ వద్ద పియోనో ప్లే చేయటం నేర్చుకున్నారు. 

తర్వాత ఎలక్ట్రానిక్‌ సింథసైజర్‌ ట్రాటోనియంపై ఇంట్రెస్ట్ పెంచుకున్నారు. దాంతో పాటు ఫిజిక్స్, కంపోజిషన్ పై కూడా ఆసక్తి పెంచుకున్నారు. దీనికి కొంత టెక్నాలజీని జోడించి ఏదైనా ఒక కొత్త ఇన్స్ట్రుమెంట్ ని డిజైన్ చేయాలని నిర్ణయించుకున్నాడు. దాని ఫలితంగా కొంతకాలానికి మిక్సర్‌-ట్రౌటోనియంని డిజైన్ చేశారు. ఇప్పుడు మనమంతా వాడుతున్న మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ అయిన ఆర్కెస్ట్రా ఇదే! ఈ క్రియేటివిటీతో ‘వన్-మ్యాన్ ఆర్కెస్ట్రా’గా చరిత్రలో నిలిచిపోయాడు.

ఈ స్పెషల్ డిజైన్‌ ఇన్స్ట్రుమెంట్ లో ఒకేసారి వివిధ  రకాల శబ్దాలు, మాటలు వినిపించేలా ఉండటం దాని ప్రత్యేకత. ఇలా ఒక కంపోజర్ గా, ఎలక్ట్రో ఇంజినీర్‌గా ఎలక్ట్రానిక్‌ మ్యూజిక్‌లో విశేష సేవలందించారు. అందుకే ఈయన్ని “పయనీర్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మ్యూజిక్” అని అంటారు. 

కేవలం మ్యూజిక్ మాత్రమే కాదు, 1940-50 మధ్య చాలా మూవీస్ కి కూడా సాలా వర్క్ చేశారు. ఆ తర్వాత  తన సొంత బ్యానర్ లో చాలా సినిమాలకు ఎలక్ట్రానిక్‌ సౌండ్‌ట్రాక్స్‌ను ప్రొవైడ్ చేశారు. అలాగే, రేడియో, టీవీ ప్రోగ్రామ్స్ తో పాటు రోస్‌మ్యారీ, ద బర్డ్స్‌ వంటి చిత్రాలకు సంగీతం అందించారు. ఆ తర్వాత.. క్వార్టెట్‌ ట్రాటోనియం, కన్సెర్ట్‌ ట్రాటోనియం, వోల్క్స్‌ట్రాటోనియంలను డెవలప్ చేశారు. 

1995లో జర్మనీ మ్యూజియంకు తన మిక్సర్‌-ట్రౌటోనియంను డొనేట్ చేశారు. ఎలక్ట్రానిక్‌ మ్యూజిక్‌లో ఎన్నో అవార్డ్స్  గెలుచుకున్న ఆస్కార్ సాలాకి ఆస్కార్‌ అవార్డ్ మాత్రం లభించలేదు. 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top