జర్నీ సేఫ్ గా సాగాలంటే… ట్రాఫిక్ రూల్స్ పాటించక తప్పదు. అది తెలిసీ కూడా త్వరగా గమ్యాన్ని చేరాలనే ఆదుర్దాతో… అడ్డ దారుల్లో వెళ్లి… కోరి ప్రమాదాలని తెచ్చి పెట్టుకుంటున్నారు. అందుకే, రాంగ్ రూట్ లో జర్నీ చేయటం ఎంతో డేంజర్.
తాజాగా వైరల్ అవుతోన్న ఓ వీడియో కూడా ఇదే చెబుతుంది. హైదరాబాద్‌లోని మైలర్ దేవ్ పల్లి, దుర్గానగర్‌లోని కూడలి వద్ద ఓ బైకర్ త్వర త్వరగా వెళ్ళాలన్న ఉద్దేశ్యంతో రాంగ్ రూట్‌లో వస్తున్నాడు. సరిగ్గా చౌరస్తా దగ్గరికి రాగానే ఆ… ఎదురుగా ఎవరు వస్తారులే! అని కేర్ లెస్ గా యూటర్న్ తీసుకోబోయాడు.
ఇంతలో ఊహించని సీన్ ఎదురైంది. ఎదురుగా ఒక కారు దూసుకొని వస్తుంది. దానిని తప్పించాబోగా… ఆ కారు పక్కనుండీ మరో కారు వేగంగా వచ్చి గుద్దేసింది.. దీంతో బైక్‌పై ఉన్న అతను ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి కింద పడ్డాడు. కొద్దిసేపట్లోనే జనమంతా అక్కడికి వచ్చి చేరారు. కానీ, స్పాట్ లోనే అతను మరణించాడు.
ఈ దృశ్యాలన్నీ అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ వీడియోని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ తన ట్విట్టర్ ఎకౌంట్లో పోస్ట్ చేశాడు. అంతేకాదు, ‘సెంటిమీటర్ ప్రయాణం అయినా రాంగ్ రూట్లో వెళ్లకండి’ అనే క్యాప్షన్ కూడా జత చేశాడు.
ముఖ్యంగా మనం ఇక్కడ 3 విషయాలు గుర్తు పెట్టుకోవాలి. ఒకటి రాంగ్ రూట్లో బైక్ నడపటం; రెండవది కూడలి వద్ద వేగంగా నడపటం; మూడవది హెల్మెట్ లేకుండా బైక్ నడపటం. ఈ మూడు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కనీసం ప్రాణాలతో అయినా బయట పడేవాడు.
సెంటీమీటర్ ప్రయాణం అయిన రాంగ్ రూట్లో వెళ్ళకండి.#RoadSafety #RoadSafetyCyberabad pic.twitter.com/SsFkp84XXc
— CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) July 7, 2022