పాదాలలో ఈ రేఖలు ఉంటే వారికిక రాజయోగమే!

Lucky Signs in Foot

సాదారణంగా చేతి రేఖలని బట్టి అదృష్టాన్ని లెక్క కట్టవచ్చు. కానీ, కాలి రేఖలని బట్టి కూడా వారి అదృష్టాన్ని అంచనా వేయవచ్చని మీకు తెలుసా!  హస్తసాముద్రిక శాస్త్రంలో కేవలం చేతి రేఖల ఆధారంగా వారి  గతం నుండి భవిష్యత్తు వరకు మొత్తం చెప్పేయొచ్చు. అయితే, అరికాళ్ళపై ఉన్న రేఖల ఆధారంగా కూడా మన ఫ్యూచర్ చెప్పొచ్చు అంటున్నారు ఆస్ట్రాలజర్స్.

మన ఫేట్ ని మార్చే శక్తి కేవలం మన చేతి, లేదా కాలి రేఖల్లోనే దాగి ఉంది. చాలామంది అరికాళ్ళలో ఉండే రేఖలని పట్టించుకోరు కానీ, అందులో మన భవిష్యత్తే ఉంది. అలాంటి రేఖల వల్ల ఒక్కోసారి రాజయోగమే పట్టొచ్చు. మరి పాదాలలో ఉండే రేఖలేవో…! వాటి అర్ధం ఏమిటో..! ఇప్పుడు తెలుసుకుందాం.

  • పాదాలలో త్రిశూలం ఆకారంలో రేఖ ఉంటే… వాళ్ళు చాలా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. ఎందుకంటే, త్రిశూలం శివుని ఆయుధం. అలాంటి రేఖని కలిగి ఉన్నవారు ఏదైనా ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేస్తూ… హయ్యర్ ఆఫీసర్ గా గొప్ప స్టేజ్ లో ఉంటారు.  వీళ్ళు ఎక్కడ నివసించినా… గౌరవ మర్యాదలతో జీవిస్తారు. ఇంకా జీవితంలోని అన్ని రకాల ఆనందాలను పొందుతారు.
  • అరికాలి మధ్య నుంచి మధ్య వేలు వరకు రేఖ వెళుతూ ఉంటే… వారు జీవితంలో చాలా ఆనందంగా ఉంటారు. కోరుకున్న ప్రతీదీ కూడా చాలా ఈజీగా పొందుతారు.
  • మడమ మధ్య నుండి అరికాలి అంచు వరకు అర్ధచంద్రాకారంలో రేఖలుంటే… ధనము, గౌరవము, పలుకుబడి పెరుగుతుంది. ఎంత గొప్పవారైనప్పటికీ… దేవునిపై భక్తి కలిగి ఉండి… సాధుస్వభావంతో జీవిస్తారు. 
  • అరిపాదంలో స్వస్తిక్, లేదా జెండా ఆకారంలో ఉన్న రేఖలుంటే… ఇక వారికి రాజయోగమే! పరోపకారం చేస్తూ… ఆధ్యాత్మిక జీవితాన్ని గడుపుతారు. అంతేకాదు, వీళ్ళు మహాపురుషులు, చాలాసార్లు పరిపూర్ణ పురుషులు కూడా అవుతారు.
  • T అక్షరం ఆకారంలో ఉన్న రేఖ కాలి  మడమకి కొద్దిగా పైన కొద్దిగా కనిపిస్తే… ఇలాంటివారు జీవితంలో మంచి వ్యాపారవేత్తలుగా ఎదుగుతారు. డబ్బు, గౌరవం సంపాదిస్తారు. ఒకసారి వీరు వ్యాపారం ప్రారంభిస్తే…  విజయం సాధించకుండా ఆపటం ఎవరితరం కాదు. 
  • అరికాలి మధ్యలో గుండ్రని ఆకారంలో రేఖ ఉంటే… దానిని ‘అక్షయ్ ధన్ రేఖ’ అంటారు. ఇలాంటి రేఖలున్న వ్యక్తులు డబ్బు సంపాదించాలంటే చాలా కష్టపడాలి. కష్టపడి పని చేస్తే కానీ ఫలితం ఉండదు. 

ఫ్రెండ్స్! ఈ ఆర్టికల్ చదివిన తర్వాత మీలో ఎంతమందికి ఇలాంటి రేఖలు ఉన్నాయో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top