సాదారణంగా మనం ఏదైనా వాచ్ షాప్ కు వెళ్ళినప్పుడో… లేదా గూగుల్‌లో వాచ్ ఇమేజ్ గురించి సెర్చ్ చేసినప్పుడో… అక్కడ సమయం 10 గంటల 10 నిమిషాలు సూచిస్తుంది. ప్రతి గడియారం ఇలా 10-10 టైమింగ్ నే ఎందుకు చూపిస్తుందని ఎప్పుడైనా ఆలోచించారా? లేదు కదూ! ఒక్కసారి థింక్ చేయండి మన చిన్నతనంలో కనీసం ఒక్కసారైనా ఈ డౌట్ వచ్చే ఉంటుంది. కాకపోతే అప్పుడు మనమది లైట్ తీసుకొని ఉంటాం.
నిజానికి దీని వెనుక ఓ సైంటిఫిక్ రీజన్ ఉంది. అదేమిటంటే… 10 గంటలు దాటి 10 నిమిషాలు అయినప్పుడల్లా… గడియారంలో ‘V’ ఆకారం ఏర్పడుతుంది. V షేప్ అనేది విక్టరీ సైన్. అంటే సమయాన్ని విజయానికి గుర్తుగా ఉపయోగిస్తున్నారని అర్ధం. అందుకే, గడియారంలో 10-10 ట్రెండ్‌గా మారింది.
మరో కారణం ఏంటంటే… 10 గంటల 10 నిమిషాల సమయం సెట్ అయినప్పుడు ఆ గ్యాప్ లో వాచ్ కంపెనీ యొక్క బ్రాండ్ నేమ్ స్పష్టంగా కనిపిస్తుంది. ఎవరైనా వాచ్‌ను చూడగానే ఫస్ట్ లుక్ కంపెనీ నేమ్ పై పడుతుంది. అందుకే అలా సెట్ చేసారనే వాదనలు కూడా ఉన్నాయి.
ఇంకో రీజన్ ఏంటంటే… సరిగ్గా 10 గంటల 10 నిమిషాలకు ఒకప్పటి అమెరికన్ ప్రెసిడెంట్ అయిన అబ్రహం లింకన్ మరణించాడని… అందుకు గుర్తుగా ఇలా ఆ టైమ్ సెట్ చేశారని చెబుతారు.
మరో రీజన్ ఏంటంటే… సరిగ్గా 10 గంటల 10 నిమిషాలకు హిరోషిమా, మరియు నాగసాకిపై దాడి జరిగిందని… దాని గుర్తుగా కూడా ఇలా సమయాన్ని ఉంచుతున్నారని కొందరు అంటారు.
ఏదేమైనా, మొత్తం మీద 10-10 టైమ్ అనేది వాచ్ లకి పర్ఫెక్ట్ గా సూట్ అయింది.