నా భార్య కొడుతోంది..ప్లీజ్ మీరే కాపాడాలి (వైరల్ వీడియో)

నా భార్య కొడుతోంది సార్ నా భార్య కొట్టే దెబ్బలు తట్టుకోలేకపోతున్నాసార్, అంటూ… అజిత్‌ సింగ్‌ అనే వ్యక్తి పోలీస్ స్టేషన్ కి వెళ్లి తన బాధ చెప్పుకున్నాడు. హృదయాన్ని కదిలించే సంఘటన రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లా భివాడిలో జరిగింది.

స్కూల్ ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్న అజిత్‌ సింగ్‌ తన భార్య తనను చిత్రహింసలు పెడుతుందని పోలీసులను ఆశ్రయించాడు. తన భార్య కొట్టే దెబ్బలని సాక్ష్యాలతో సహా పోలీసులకు సమర్పించాడు. ఆమెనుంచీ ఎలాగైనా కాపాడాలి సార్‌ అంటూ కన్నీళ్లు తో మొరపెట్టుకున్నాడు.

అజిత్ సింగ్ యాదవ్, సోనిపట్ గ్రామానికి చెందిన సుమన్‌ ను 7 సంవత్సరాల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొంతకాలంగా కాపురం సాఫీగానే సాగింది. ఆ తర్వాతే గొడవలు మొదలయ్యాయి. పెళ్లిచేసుకున్న కొన్ని నెలలకే తన భార్య గయ్యాళితనం గుర్తించినట్లు తెలిపాడు. ప్రస్తుతం ఆమె తనని చిత్రహింసలకు గురి చేస్తుందని పోలీసుల ఎదుట అజిత్‌ సింగ్‌ తన బాధ వెల్లబుచ్చాడు. తన భార్య కొడుతున్న దృశ్యాలను సీసీ ఫుటేజ్‌ విజువల్‌ పోలీసుల ఎదుట సమర్పించాడు.

ఆధారాలతో సహా బయటపెట్టటానికి అజిత్ సింగ్ యాదవ్  గతంలో ఇంట్లో సీసీటీవీ కెమెరాలను అమర్చాడు. వాటి ఆధారంగా రక్షణ కోసం కోర్టును ఆశ్రయించాడు. ఆ ఫుటేజ్ లో తన భార్య క్రికెట్ బ్యాట్‌తో కొడుతుండగా, వాళ్ళ కొడుకు పక్కనే ఉండి చూస్తూ ఉండిపోయాడు తప్ప..ఏమీ చేయలేకపోయాడు.

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top