సమంతకి యాక్సిడెంట్..? చైతూ ఉసురే తగిలిందా..!

టాలీవుడ్ క్రేజీ స్టార్స్ విజయ్ దేవరకొండ, సమంతలు ఫస్ట్ టైమ్ కలిసి నటిస్తున్న చిత్రం ఖుషి. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే కాశ్మీర్ లో మొదలైందన్న సంగతి తెలిసిందే! మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సారధ్యంలో, శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ జరుపుకుంటుంది. 

అయితే, ఈ మూవీకి సంబంధించి ఒక రూమర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఒక స్టంట్ సీక్వెన్స్ చిత్రీకరణ సమయంలో విజయ్, సమంత ప్రమాదానికి గురైనట్లు వార్తలు వచ్చాయి. వీరిద్దరి వెహికల్ నదిలోకి పడిపోవటం వల్ల వీరికి గాయాలయ్యాయని వార్తలు వినిపిస్తూ వచ్చాయి. 

ఈ విషయం కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నాగచైతన్య అభిమానులు రెచ్చిపోయారు. సమంతకి నాగ చైతన్య ఉసురే తగిలిందనీ, అందుకే యాక్సిడెంట్ అయిందనీ పెద్ద ఎత్తున కామెంట్లు పెట్టారు. చైతూ ఫ్యాన్స్ ఈ విధంగా తనని ట్రోల్ చేయడంతో… సమంత కూడా ఒకానొక దశలో చాలా యాంగ్జైటీకి గురైంది. తర్వాత ఇదంతా ఫేక్ న్యూస్ అంటూ చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top