మెగా ఫ్యాన్స్ కి కిక్కిచ్చే న్యూస్…

మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో చాలా చాలా బిజీగా ఉన్న సంగతి మన అందరికి తెలిసిందే… కొద్ది కాలం గ్యాప్ తరువాత ఆచార్య సినిమాతో మన అందరిని అలరించిన చిరు… ఇప్పుడు గాడ్ ఫాదర్, బోళా శంకర్ సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరించ పోతున్నాడు. అయితే ప్రస్తుతం ఈ సినిమాలు శర వేగంగా షూటింగ్ జరుపుకుంటూ విడుదలకు సిద్దంగా ఉన్నట్లు సమాచారం.

వీటితో పాటుగా డైరక్టర్ బాబీ దర్సకత్వంలో చేయబోతున్న మరో మూవీ టైటిల్ గురించి కూడా ఫిల్మ్ సర్కిల్లో వార్తలు చక్కెర్లు కొట్టటం మన అందరికి తెలిసిందే! గతంలో ఆచార్య సినిమా షూటింగ్ లో భాగంగా మన చిరు సైతం ఈ సినిమాకు టైటిల్ వాల్తేరు వీరయ్య అని లీక్ చేయటం మన అందరికి తెలిసిందే! ఇప్పుడు ఈ సినిమాకు సంబందించిన ఓ క్రేజీ అప్డేట్ సినిమా రంగంలో చక్కర్లు కొడుతుంది.

ఈ చిత్రానికి సంబందించిన మిగిలిన సన్నివేశాలను వచ్చే నెల 6 న మలేషియాలో జరపటానికి అక్కడి బాబీ టీం ప్లాన్ చేసినట్లు సమాచారం. దీనితో పాటుగా ఈ సినిమాకు సంబందించిన గ్లింప్స్ కూడా త్వరలోనే పూర్తి చేసి విడుదల చేయాలని బాబీ టీం భావిస్తున్నట్లు సమాచారం.

ఈ చిత్రానికి మెగాస్టార్ సరసన శ్రుతి హాసన్ నటిస్తుంది. అలాగే ప్రత్యేక పాత్రలో మన కిక్ హీరో , మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్నారు. ప్రస్తుతం చిరు హీరోగా నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమా చివరి దశ పూర్తి చేసుకుని శర వేగంగా ప్రేక్షకుల ముందుకు రావటానికి తేదీని కరారు చేయాలని అక్కడి టీం భావిస్తున్నట్లు సమాచారం.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top