Woman Pushed onto Subway Tracks

రైలు వస్తుంటే చూసి మహిళని నెట్టేశాడు… ఆ తర్వాత జరిగింది చూసి అంతా షాకయ్యారు..!

సరిగ్గా రైలు వచ్చే టైమ్ చూసి ఒక మహిళని పట్టాలపైకి నెట్టాడు. ఆ తర్వాత జరిగిన పరిణామం చూసి అందరూ షాకయ్యారు. బాగా రద్దీగా ఉన్న ఒక మెట్రో స్టేషన్ లో జరిగిన ఘటన ఇది.

జనవరి 14న బెల్జియంలోని బ్రస్సెల్స్‌లో ఉన్న మెట్రో స్టేషన్ లో ఊహించని సంఘటన్ జరిగింది. ట్రైన్ కోసం ప్రయాణీకులంతా వేచి ఉన్నారు. ఇంతలో వారు ఎదురుచూస్తున్న ట్రైన్ రానే వచ్చింది. అది ఆగగానే ఎక్కాలని రెడీ అవుతున్నారంతా.

తోటి ప్రయాణీకుల మాదిరిగానే ఒక 55 ఏళ్ల మహిళ కూడా ప్లాట్ ఫామ్ పై రెడీగా ఉంది. ఇంతలో వెనక నుంచి ఎవరో ఆమెని బలంగా నెట్టారు. ఏమి జరిగిందో తెలిసే లోపే ఆమె పట్టాలపై పడి ఉంది. వెంటనే లేవలేకపోయింది. ఇంతలో ట్రైన్ వచ్చేసింది. అందరిలోనూ టెన్షన్ మొదలైంది.

కానీ, సమయానికి డ్రైవర్ సడెన్ బ్రేక్ వెయ్యడంతో ట్రైన్ ఆగిపోయింది. దీంతో ఆ మహిళ సేవ్ అయింది. ట్రైన్ ఆగిన తర్వాత ప్రాణాలతో ఉన్న ఆమెని చూసి ఊపిరి పీల్చుకున్నారు. పెద్దగా గాయాలేవీ తగలలేదు. కానీ, షాక్ లోకి వెళ్ళిపోయింది. తర్వాత ఆమెని ఆస్పత్రికి తరలించారు.

People experiencing the mysterious hum sound heard on Earth, unexplained low-frequency noise
భూమిపై రహస్య శబ్దం – ఎవరికీ అర్థం కాని హమ్ సౌండ్

సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడ్ని పోలీసులు గుర్తించారు. అతని వయసు 23 సంవత్సరాలు. వ్యక్తిగత సమస్యలతో సతమతమవుతూ అతను తన కోపాన్ని ఆమెపై చూపించినట్లు విచారణలో తేలింది.

విచిత్రం ఏంటంటే, ట్రైన్ కి సడెన్ బ్రేక్ వేసిన మెట్రో డ్రైవర్ కూడా ఈ సంఘటన కారణంగా షాక్ లోకి వెళ్ళిపోయారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top