సైబరాబాద్ ప్రాంతంలో వ్యభిచారం నిర్వహిస్తున్న కొన్ని ఏరియాలలో హ్యూమన్ ట్రాఫికింగ్ రెస్క్యూ టీమ్ దాడులు జరిపింది. ఇందులో ప్రాస్టిట్యూషన్ చేస్తున్న 14 మంది మహిళలని అదుపులోకి తీసుకుంది. వీరంతా 19–25 సంవత్సరాల మద్య వయసు ఉన్నవాళ్ళే! వీరిని పేటా కేసుక్రింద అరెస్ట్ చేశారు.
ఈ మహిళలని కోర్టు ఆదేశంతో… నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రాజేంద్రనగర్ హైదర్ షా కోట్ కస్తూర్భా గాంధీ ఆశ్రమంలో చేర్పించారు. అక్కడ వీరి పరివర్తనలో మార్పు తీసుకువచ్చి, సమాజంలో గౌరవంగా బతికేలా చేయాలని 20 రోజులనుండీ తర్ఫీదు కూడా ఇస్తున్నారు.
అయితే, నిన్న అర్దరాత్రి సడెన్ గా 2 గంటల సమయంలో బాత్‌రూం వెంటిలేటర్ అద్దాలు పగలగొట్టి… ప్రహరీ గోడ దూకి… వీరంతా ఎస్కేప్ అయ్యారు. తెల్లారేసరికి వీరు కనిపించకపోవటంతో ఆశ్రమ నిర్వాహకులు పోలీసులకి ఫిర్యాదు చేశారు. ఆశ్రమంలో ఉన్న సీసీ టీవీ ఫూటేజ్ పరిశీలించగా అసలు విషయం బయటపడింది.