Monkey Beating Dog

కోతికి అడ్డంగా బుక్కైన కుక్క… తర్వాత ఏమైందో తెలిస్తే షాక్! (వీడియో)

కోతులు చేసే అల్లరి అంతా ఇంతా కాదు. అందుకే వీటి చేష్టలని కోతి చేష్టలు అంటుంటారు. ఇక జనావాసాల్లోకి వచ్చినప్పుడు వీటి గోల చెప్పనక్కర్లేదు. తరచూ ఏదో ఒక యానిమల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అందులో భాగంగానే ఈ వీడియో కూడా నెటిజన్లని తెగ ఇంప్రెస్ చేసింది.

ఒక కోతి జనావాసంలోకి వచ్చింది. అంతా ఎవరి పనుల్లో వారు ఉన్నారు. ఒక పెద్ద వృక్షం కింద ఆ కోతి అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. ఇంతలో ఒక కుక్క అక్కడికి వచ్చింది. వచ్చింది ఊరుకోకుండా ఆ కోతికి ఎదురుగా వెళ్లి నిల్చుంటుంది. ఎంతైనా కోతి కాదా..! దాని బుద్ధి ఎక్కడికి పోతుంది? ఆ కుక్కని ముక్కు గిల్లుతుంది. అయినా పాపం ఆ కుక్క ఏమీ అనకుండా సర్దుకు పోతుంది. ఇక ఆ కోతికి ఏం చేయాలో తోచలేదు. పక్కనే ఒక కర్ర కనిపిస్తుంది. వెంటనే ఆ కర్రతో కుక్క నెత్తిన ఒక్కటి పీకింది. చేసేదేమీలేక కుయ్యో… మొర్రో… అంటూ తోక ముడుచుకొని ఆ కుక్క అక్కడి నుండీ వెళ్ళిపోతుంది. 

ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ, ఈ వీడియో మాత్రం నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తుంది. లేటెందుకు మరి, మీరు కూడా ఓలుక్కేయండి..

Tiger Cub Pranks
పులి పిల్ల చేసిన ప్రాంక్ కి షాకైన తల్లి పులి (వీడియో)

 

 

View this post on Instagram

 

మావటిని వరుస హగ్ లతో ముంచెత్తుతున్న గున్న ఏనుగు (వీడియో)

A post shared by beautiful pix (@beautiful_pix4)

Viral Video

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top