4 Year Old Girl gets Attacked by 5 Street Dogs in Bhopal

4 ఏళ్ల చిన్నారిపై 5 వీధి కుక్కలు మూకుమ్మడి దాడి(వీడియో)

వీధి కుక్కల గుంపు ఒకటి నాలుగేళ్ల చిన్నారిపై దాడి చేసి గాయపరిచిన సంఘటన తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఆ చిన్నారి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రిలో చేర్పించారు. ఇదంతా జరిగింది మరెక్కడో కాదు. మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో. 

మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో ఉన్న బాగ్‌సేవానియా ప్రాంతంలోని అంజలి విహార్‌ కాలనీలో ఓ నాలుగేళ్ల బాలిక ఇంటి బయట ఆడుకుంటూ ఉంది. ఇంతలో అటువైపుగా వచ్చిన 5 వీధి కుక్కలు ఆ చినారిని వెంబడించాయి. భయంతో పరిగెత్తిన బాలికని చూసి ఆ కుక్కలు మరింత రెచ్చిపోయి వెంబడించ సాగాయి.

కొద్ది దూరంలో ఆ బాలికని ముందుకు పోనీయకుండా ఒక కుక్క అడ్డుకుంటుంది. దీంతో భయంతో అక్కడే ఆగిపోయిన బాలికని మిగిలిన కుక్కలన్నీ చుట్టుముట్టాయి. ఇంతలో ఒక కుక్క ఆ చిన్నారి చెవి పట్టుకొని లాగి కింద పడేసింది. అలా పడిపోయిన బాలికపై కుక్కలన్నీ కలిసి మూకుమ్మడి దాడి చేశాయి.

ఆ చిన్నారి తల, కడుపు, కాళ్ళపై అత్యంత దారుణంగా కొరికి గాట్లు పెట్టాయి. ఇంతలో అటువైపుగా వచ్చిన ఓ వ్యక్తి ఆ దృశ్యం చూసి కుక్కలను తరిమి కొట్టడంతో ఆ చిన్నారి ప్రాణాలతో బయటపడింది. ఆ  వ్యక్తే రాకపోయి ఉంటే… ఆ చిన్నారి పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. 

ప్రస్తుతం ఆ చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ఇదంతా సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. ఆ చిన్నారి పేరు గుడ్డి బన్సాల్‌. ఆమె తల్లిదండ్రులు కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఎప్పటిలాగే వారు కూలీ పనికి వెళ్ళగా… ఆ చిన్నారి బయట ఆడుకుంటూ ఉంది. ఆ క్రమంలోనే ఈ సంఘటన చోటుచేసుకుంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top