ఆత్మవిశ్వాసం ముందు అంగవైకల్యం కూడా తలవంచింది (వీడియో)

ఆత్మ విశ్వాసం ముందు అంగవైకల్యం తలవంచింది. విధి వెక్కిరించినా… ఎవరేమనుకున్నా… అవరోధాలు ఎదురైనా… కేవలం చదువు కోవాలనే తపన, కోరికతో అవయవ లోపాన్ని కూడా లెక్క చేయకుండా ఒంటి కాలుతో స్కూల్ కి వెళుతుంది ఓ బాలిక.

సాదారణంగా జీవితమన్నాక ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఎన్ని సమస్యలు చుట్టుముట్టినా సరే భయపడకుండా… పట్టుదలతో, ఆత్మవిశ్వాసంతో, మనోధైర్యంతో ముందుకు సాగినట్లైతే…  అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చు.

ఇప్పుడు మనం చెప్పుకొనే టాపిక్ లో కూడా ఓ చిన్నారికి  తన నిజ జీవితంలో ఊహించని సంఘటన ఎదురైంది. కానీ, దానినే తలచుకొని బాధపడుతూ కూర్చోకుండా మనోధర్యంతో ఆ సమస్యకే ఎదురుతిరిగింది. ఇంకేముంది ఆ సమస్య కాస్తా ఆ చిన్నారికి తలవంచింది.

బీహార్ లోని జూమయి జిల్లాకు చెందిన ‘సీమా’ అనే బాలికకు రెండేళ్ళ క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో డాక్టర్లు ఒక కాలు తీసేశారు. దీంతో ఆ అమ్మాయి బాగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది. అయ్యో! ఇంకేముంది నా చదువు మద్యలోనే ఆగి పోతుందేమో అని తనలో తాను ఎంతగానో మదన పడింది. ఈ విషయమై లోలోపల చాలా కుమిలిపోయింది. 

కానీ, తన మనస్సు అందుకు అంగీకరించటంలేదు. ఎటు చూసినా తన లక్ష్యమే తనను వెంటాడుతుంది. ఎలాగైనా, ఎవరేమనుకున్నా సరే చదువుకోవాలని నిర్ణయించుకుంది. పట్టుదలతో తనకున్న అంగవైకల్యాన్ని కూడా లెక్క చేయకుండా  ఒంటి కాలుతో గెంతుతూ… ప్రతి రోజూ స్కూల్ కి వెళ్ళటం ప్రారంభించింది.

Aquarius September 2025 horoscope with career, love, health, and astrology predictions
కుంభ రాశి వారికి సెప్టెంబర్ నెలలో ఏమి జరగబోతుంది?

అయితే, ఈ బాలిక అలా ఒంటి కాలుతో స్కూల్ కి వెళ్ళుతున్న దృశ్యాన్ని స్థానికంగా ఉన్న ఒక వ్యక్తి వీడియో తీశాడు. అంతటితో ఊరుకోకుండా దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంతే! ఇంకేముంది ఈ వీడియో కాస్తా వైరల్ అయి కూర్చుంది. 

అక్కడితో ఆగలేదు, ఈ వీడియో అటు తిరిగి, ఇటు తిరిగి రియల్ హీరో సోనూ సూద్ దగ్గరికి చేరింది. ఇలాంటి వీడియో చూశాక మన హీరో మనసు ఊరుకుంటుందా..! అర్జెంట్ గా ఆ చిన్నారికి కావాల్సిన సదుపాయాలన్నీ అందించాలని అనుకున్నాడు. వెంటనే తాను చేయవలసింది అంతా చేశాడు. ఇప్పుడీ చిన్నారి రెండు కాళ్ళతో నడుస్తూ… సంతోషంగా స్కూల్ కి వెళ్తుంది.

తన కోరిక తీరినందుకు ఆ పాప ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. అనుకున్న లక్ష్యాన్ని సాధించిందని తన తల్లితండ్రులు కూడా ఎంతగానో మురిసిపోతున్నారు. అంతేకాదు, తోటి పిల్లలతో పాటు తానుకూడా రెండు కాళ్ళతో నడుస్తూ స్కూల్ కి వెళ్ళటం చూసి ఆ ఊరి జనాలు సైతం ఆనందం, ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

చూశారా ఫ్రెండ్స్! పట్టుదల ఉంటే దేన్నైనా సాధించవచ్చని చెప్పటానికి ఈ పాప జీవితమే ఒక నిదర్శనం.

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top