Acharya Movie Trailer

అదరగొట్టేసిన ‘ఆచార్య’ ట్రైలర్…

పాఠాలు చెప్పే అలవాటు లేకపోయినా… గుణపాఠాలు చెబుతానంటూ ‘ఆచార్య’ వచ్చేశాడు. ఈ ఆచార్య రాకకోసమే వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు ఆయన అభిమానులు. ఎట్టకేలకు నిరీక్షణ ఫలించి, ఆచార్య వచ్చేశాడు. ది మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ ఆచార్య ట్రైలర్ ఈరోజు వచ్చేసింది. అదికూడా ఏకంగా థియేటర్లలోనే రిలీజ్‌ అయిపోయింది. 

ఒకపక్క మెగాస్టార్, మరోపక్క మెగా పవర్ స్టార్. వీళ్ళిద్దరూ కలిసి ఓకే ఫ్రేమ్ లో కనిపించేసరికి ఇక  ఫ్యాన్స్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. కొరటాలశివ డైరెక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుట్టబొమ్మ పూజా హెగ్డే, టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ నటించిన చిత్రం  ఆచార్య. 

ఇక ట్రైలర్ విషయానికొస్తే, సిద్ధ (రామ్ చరణ్) అమ్మవారి ఆలయంలో పూజా పునస్కారాలు నిర్వహిస్తూ ఉంటాడు. నీలాంబరి (పూజా హెగ్డే) తరచూ ఆ గుడికి వస్తూ ఉంటుంది. రామ్ చరణ్ వాయిస్ ఓవర్ తో ఆద్యంతం సాగిన ఈ ట్రైలర్ అందరినీ విపరీతంగా ఆకట్టుకుంది. ‘పూజా పునస్కారాలు చేసుకుంటూ బతికినంత మాత్రాన తాము సౌమ్యులు కామని, ఆపద వస్తే ఆ అమ్మోరు తల్లే తమలో ఆవహిస్తుందని ఈ ధర్మస్థలి అధర్మస్థలి ఎలా అవుతుందని’ చెప్పే డైలాగ్స్ విపరీతంగా ఆకట్టుకున్నాయి. ‘నేను వచ్చానని చెప్పాలనుకున్నా… కానీ, చేయడం మొదలు పెడితే…’ అంటూ చిరంజీవి చెప్పే డైలాగ్స్ అదిరిపోయాయి. 

మొత్తమీద కాస్త లేటయినా… మెగా మార్క్ చూపించారు ఈ ట్రైలర్ లో. 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top