Africa Splitting Apart New Ocean

ఖండాన్ని చీల్చుకొని పుట్టుకొస్తున్న కొత్త మహా సముద్రం

ఖండాన్ని చీల్చుకొని ఓ కొత్త సముద్రం పుట్టుకొస్తుంది. దీనివల్ల ఆ ఖండం రెండుగా స్ప్లిట్ అవ్వబోతుంది. ఈ కారణంగా ఆ ఖండంలో ఉన్న కొన్ని దేశాలు ఐలాండ్స్ గా మారిపోనున్నాయి. 

ఏ ఖండం రెండుగా చీలిపోతుంది? 

రెండుగా చీలిపోబోతున్న ఆ ఖండం వేరే మరేదో కాదు, ప్రపంచంలో రెండో అతిపెద్ద ఖండమైన ఆఫ్రికా ఖండం. అవును, మీరు విన్నది నిజమే! ఆఫ్రికా ఖండం భవిష్యత్తులో రెండుగా చీలబోతోంది. దీనివల్ల ప్రపంచ పటం మారబోతోంది.. ఇకమీదట భవిష్యత్తులో ఖండాలు ఏడు కాదు, ఎనిమిది అని చెప్పే సమయం రాబోతోంది.

ఆఫ్రికా ఖండం రెండుగా చీలిపోతోంది. ఆ చీలిక మధ్యలో ఓ సరికొత్త సముద్రం ఏర్పడబోతోంది. అందుకు భూమి లోపలా, బయటా కూడా ఆల్రెడీ సంకేతాలు మొదలైపోయాయని సైంటిస్టులు, జియాలాజిస్టులు ఎన్నో ఏళ్లుగా చెప్తున్నారు. 

కొత్త మహాసముద్రం ఎక్కడ ఏర్పడుతోంది?

ఆఫ్రికన్‌ రిఫ్ట్‌ వ్యాలీ ద్వారా ఈ కొత్త మహాసముద్రం ఏర్పడుతోందని సైంటిస్టులు చెప్తున్నారు. 2005 నాటికే  సౌత్ వెస్ట్ కెన్యాలో ఉన్న ఇథియోపియాలోని ఎడారుల్లో… జోర్డాన్‌ నుంచి మొంజాబిక్‌ వరకూ 6400 కిలోమీటర్ల పొడవు, 35 మైళ్ల వెడల్పున ఓ భారీ చీలిక ఏర్పడిందట. ఆ చీలికే మహాసముద్రం ఏర్పాటుకు నాంది అని వీళ్ళు పేర్కొన్నారు.

రిఫ్టింగ్ అంటే ఏమిటి?

రిఫ్టింగ్ అనేది ఒక జియోలాజికల్ ఫెనోమినన్. ఇది ఒక టెక్టోనిక్ ప్లేట్‌ను రెండు లేదా అంతకంటే ఎక్కువ ప్లేట్‌లుగా డివైడ్ చేసి, ప్లేట్ బౌండరీస్ ని వేరు చేయడం ద్వారా ఆ టెక్టోనిక్ ప్లేట్‌ను వేరు చేస్తుంది. ఇలా వేరు చేయబడిన టెక్టోనిక్ ప్లేట్‌ ఒక భారీ చీలికను సృష్టిస్తుంది. 

ఈ చీలిక అనేది భూమి లోపలి టెక్టోనిక్ ప్లేట్లు విడిపోయినప్పుడు లేదా చీలిపోయినప్పుడు ఏర్పడిన లోతట్టు ప్రాంతం. చీలిక లోయలు భూమిపై అలాగే సముద్రపు లోపలా కూడా కనిపిస్తాయి, ఇవన్నీ టెక్టోనిక్ చర్య ద్వారా మాత్రమే ఏర్పడతాయి, 

రిఫ్ట్ వ్యాలీ అంటే ఏమిటి? 

భూమి లోపలి పొరల్లో ఉండే టెక్టానిక్ ప్లేట్లు చీలిపోయే చోట ఏర్పడే లోతట్టు ప్రాంతాన్ని ‘రిఫ్ట్ వ్యాలీ’ అంటారు. ఆఫ్రో–అరేబియన్ రిఫ్ట్ సిస్టమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  లేదా తూర్పు ఆఫ్రికన్ రిఫ్ట్ సిస్టమ్ గా పిలవబడే  ప్రాంతంలో గత కొన్నేళ్లుగా కదలికలు వస్తున్నాయి. ఈ తూర్పు ఆఫ్రికన్ రిఫ్ట్ వ్యాలీనే ‘గ్రేట్ రిఫ్ట్ వ్యాలీ’ అని కూడా పిలుస్తారు. ఇది చాలా పొడవైన వ్యాలీ. ఈ వ్యాలీలో ఉన్న  రెండు టెక్టానిక్ ప్లేట్లు నిరంతరం కదులుతూ ఉండడంతో ఈ చీలికలు ఏర్పడుతున్నాయి.

దీని ఎఫెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భూమ్మీదే కాకుండా సముద్రంలో కూడా పడింది. ఈ చీలిక వల్ల తూర్పున ఉండే సోమాలియా ప్లేట్, పశ్చిమాన ఉండే నుబియన్ ప్లేట్ ఒకదానికొకటి విడిపోయి దూరంగా జరుగుతున్నాయి. ఈ  రెండు టెక్టానిక్  ప్లేట్ల మధ్య పెరుగుతున్న దూరాన్ని మొదటిసారిగా 2004లో గుర్తించారు.  ప్రస్తుతం ఈ చీలిక ఉత్తరాన ఉన్న ఎర్ర సముద్రం నుండి ఆఫ్రికన్ ఖండానికి ఆగ్నేయంలో ఉన్న మొజాంబిక్ వరకు సుమారు 3,500 కిమీ వరకూ విస్తరించింది. 

ఎఫర్ ట్రిపుల్ జంక్షన్ అంటే ఏమిటి?

సోమాలియా ప్లేట్, ఆఫ్రికన్ ప్లేట్ నుండి విడిపోయే ప్రక్రియ రీసెంట్ గా ఇప్పుడు మొదలైంది కాదు, దాదాపు 30 మిలియన్ల సంవత్సరాల క్రితమే మొదలైంది. ఈ విషయాన్ని సైంటిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు 20 ఏండ్ల క్రితం నిర్ధారించారు. 

ఆఫ్రికన్ ప్లేట్… అరేబియా ప్లేట్ నుండి యాక్టివ్ డైవర్జెంట్ రిడ్జ్ సిస్టమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో దూరంగా జరుగుతూ వెళ్తోంది. దీనివల్ల ఎర్ర సముద్రం, గల్ఫ్ ఆఫ్ ఎడెన్ కూడా స్ప్లిట్ ఆవుతున్నాయి. ఈ చీలిక  నుబియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేట్, సోమాలియా ప్లేట్, అరేబియన్ ప్లేట్ కలిసే ప్రాంతంలో వస్తుంది. ఇది చూడటానికి అచ్చం ‘Y’ ఆకారంలో ఉండడం వల్ల ఈ ప్రాంతాన్ని “ఎఫర్ ట్రిపుల్ జంక్షన్” అంటారు. ఈ జంక్షన్ దగ్గర మూడు టెక్టానిక్  ప్లేట్లు విడిపోతున్నాయి. ఈ టెక్టానిక్ ప్లేట్లు ప్రతి ఏడాది ఏడు మిల్లీమీటర్లు వరకూ విస్తరిస్తున్నాయి. 

కొత్త ఖండం ఎలా రూపాంతం చెందుతుంది?

కొన్ని వేల కిలోమీటర్ల పొడవున్న ఈ భారీ చీలిక వల్ల ప్రస్తుతం ఆఫ్రికా ఖండంలో ఉన్న సోమాలియా, ఇథియోపియా, టాంజానియా, కెన్యా అలానే, కెన్యాలో ఉన్న మరికొన్ని ప్రాంతాలు కలిసి ఓ కొత్త ఖండంగా ఏర్పడే అవకాశం ఉంది. 

ఇలా కొత్త ఖండం…కొత్త సముద్రం… ఏర్పడటానికి సుమారు 5 మిలియన్ల నుంచి 10 మిలియన్ సంవత్సరాలు పట్టవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అయితే, ఈ కొత్త ఖండం..కొత్త సముద్రం ఏర్పాటు వల్ల ఇప్పుడు సముద్రం లేని ఉగాండా, జాంబియాలకు కొత్తగా సముద్ర తీరప్రాంతం ఏర్పడుతుంది.

గతంలో కూడా ఖండాలు విడిపోయాయా?

సుమారు 138 మిలియన్‌ సంవత్సరాల క్రితం కూడా  ఇలాంటి పరిణామం వల్లే దక్షిణ అమెరికా, ఆఫ్రికా రెండు ఖండాలుగా విడిపోయాయి. ఇప్పుడు ఆఫ్రికాలోనూ ఇలాంటి పరిణామాలే కనిపిస్తున్నాయి. గత 30 మిలియన్ సంవత్సరాలుగా అరేబియన్ ప్లేట్ ఆఫ్రికా నుంచి దూరంగా వెళుతోంది. ఈ ప్రక్రియ ఫలితంగా ఎర్ర సముద్రం, ఏడెన్ గల్ఫ్ ఏర్పడింది. ఇక రీసెంట్ గా 2005లో ఇథియోపియా ఎడారిలో 56 కిలోమీటర్ల పొడవునా భారీ పగులు ఏర్పడింది.

కొత్త మహాసముద్రంలోకి నీరు ఎక్కడినుండీ వస్తుంది?

ఇథియోపియన్ పీఠభూమిపై మాగ్మా కరిగి తూర్పు ఆఫ్రికా అంతటా విస్తరిస్తుంది. సుమారు  45 మిలియన్ సంవత్సరాలపాటు ఈ ప్రక్రియ ఇలా కొనసాగుతూనే  ఉంటుంది.  ఈ మాగ్మా ఎర్ర సముద్రం, గల్ప్ ఆఫ్ ఏడెన్, ఈస్ట్ ఆఫ్రికన్ రిఫ్ట్ ని దాటి కొన్ని వేల కిలోమీటర్ల కంటే ఎక్కువ తూర్పు ఆఫ్రికా అంతటా విస్తరిస్తూ పోతుంది. 

ఇథియోపియా భూగర్భంలో ఉన్న ఆ చిన్న అగ్నిపరత్వం, ఉప్పునీటి ప్రవాహాన్ని అడ్డుకుంటోంది. అప్పుడు సోమాలియన్ ఫలకం, ఆఫ్రికన్ ఫలకాలు విడిపోయి, హిందూ మహా సముద్రం దిశగా చీలిక ఏర్పడి, ఆ చీలిక నుంచి కొత్త మహాసముద్రం ఏర్పడేందుకు వీలు కలుగుతుంది.  నిజానికి ఇది కొత్త మహాసముద్రం ఏర్పడినట్లు కాదు. ఎర్ర సముద్రపు నీరే ఆ చీలికలోకి వచ్చి చేరుతుంది. 

మూడు టెక్టోనిక్ ప్లేట్లు డిఫరెంట్ స్పీడ్ తో మూవ్ అవుతున్నాయి. అరేబియన్ ప్లేట్…  ఆఫ్రికన్ ప్లేట్ నుంచి ఏడాదికి 2.5 సెంటీమీటర్ల మేర దూరం జరుగుతోంది. మిగిలిన రెండూ ఏడాదికి అర సెంటీమీటర్ మేర కదులుతున్నాయి. అలా కదులుతూ నిదానంగా కొన్నాళ్లకు ఆఫ్రికా ఖండాన్ని రెండుగా చీల్చుతాయి. ఈ చీలికలోకి ఎర్ర సముద్రం, గల్ఫ్ ఆఫ్ ఏడెన్‌ల నుంచి సముద్రపు నీరు వచ్చి చేరుతుంది. 

భారీ భూకంపాలు వస్తే ఏం జరుగబోతుంది?

అఫార్ డిప్రెషన్‌లో మహా సముద్రం పుట్టటానికి దారితీసే అంశాలను గనుక పరిశీలిస్తే, ఈ చీలిక మరింతగా పెరిగే కొద్దీ సముద్రపు నీరు చేరడం కూడా మరింత పెరుగుతుంది. ఈ ప్రక్రియ వేగవంతం అవ్వటం అనేది ఆయా ప్రాంతాన్ని బట్టి ఉంటుంది. అంటే… ఆ ప్రాంతంలో అతి, పెద్ద భూకంపాల వంటివి చోటుచేసుకుంటే, ఈ సమయం మరింత తగ్గొచ్చని చెప్తున్నారు.

అయితే,, ఈ జియోలాజికల్ ప్రాసెస్ మొత్తం రాబోయే కొన్ని శతాబ్దాల్లోనో లేదా వేల సంవత్సరాల్లోనో జరిగేది కాదు. అందుకు కొన్ని మిలియన్ల సంవత్సరాలే పడుతుందని గతంలో అంచనా వేశారు. కానీ, ఇప్పుడున్న పరిస్థితుల కారణంగా ఊహించిన దాని కంటే త్వరగానే ఏర్పడనుందని అంటున్నారు. 

ముగింపు 

ఇదింతా విన్న తర్వాత ఫ్యూచర్ లో నేచర్ మనకి ఓ కొత్త కాంటినెంట్ ని, అలానే ఓ కొత్త ఓషన్ ని గిఫ్ట్ గా ఇవ్వబోతుందని అర్ధమవుతుంది. ఇదే నిజమైతే భవిష్యత్తులో ఇక ఖండాలు 7  కాదు, 8 అనీ; అలానే  సప్త సముద్రాలు కాదు, అష్ట సముద్రాలు అని చెప్పే సమయం ఎంతో దూరంలో లేదు. 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top