అక్షయ తృతీయ రోజున ఈ తప్పులు అస్సలు చేయకండి!

అక్షయ తృతీయ హిందూవులకు ఎంతో పవిత్రమైన రోజు. పెళ్లిళ్లు, ప్రారంభోత్సవాలు, గృహ ప్రవేశాలు, కొత్త వ్యాపారాలు, కొనుగోళ్లు వంటి శుభాకార్యాలన్నీ ఈరోజునే  ఎక్కువగా చేస్తుంటారు. వీటిలో కొనుగోళ్లకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంటారు. ముఖ్యంగా ఈరోజున బంగారం కొనుగోలు చేస్తే ఎంతో మంచిదని కూడా చెప్తుంటారు. 

ప్రతీ సంవత్సరం అక్షయ తృతీయ వైశాఖ మాసం శుక్ల పక్షం మూడవ రోజున వస్తుంది. ఇలాంటి పవిత్రమైన రోజున చేసే కొన్ని పొరపాట్ల వల్ల లక్ష్మీ దేవి ఆగ్రహానికి గురవుతుంటారని చెప్తారు. మరి ఈ రోజు చేయకూడని ఆ తప్పులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

  • అక్షయ తృతీయ నాడు లక్ష్మి దేవిని పూజించటం సాంప్రదాయం. అయితే  కొంతమంది తెలియక కేవలం లక్ష్మిదేవిని మాత్రమే పూజిస్తారు. ఇది చాలా తప్పు. లక్ష్మి దేవితో పాటు విష్ణుమూర్తిని కూడా కలిపి పూజించాలి. అలా పూజించినప్పుడే పుణ్యం లభిస్తుంది.
  • అక్షయ తృతీయ రోజు చేసే పూజ కోసం తులసి ఆకులను ఉపయోగించటం ఆనవాయితీ! అయితే, తులసి ఆకులను కోసేముందు, శారీరక పరిశుభ్రతపై దృష్టి పెట్టాలి. 
  • అక్షయ తృతీయ రోజున ఖాళీ చేతులతో తిరిగి ఇంటికి తిరిగి రావడం అస్సలు మంచిది కాదు. వీలైనంత వరకూ ఏదో ఒక చిన్నపాటి వస్తువునైనా కొనుగోలు చేయండి. కుదిరితే, బంగారం, లేదా వెండి కొనుగోలుకి ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఒకవేళ అది సాధ్యం కాకపోతే, మెటల్‌తో చేసిన ఏ వస్తువునైనా కూడా ఇంటికి తీసుకురావచ్చు.
  • ముఖ్యంగా ఈ రోజు సూచీ, శుభ్రతకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సంపద నిల్వ ఉన్న స్థలాన్ని స్నానం చేయకుండా శుభ్రం చేయవద్దు. అలాగే, సాయంత్రం వేళ  ప్రధాన ద్వారం దగ్గర దీపం వెలిగించటం శ్రేయస్కరం.
  • కనీసం ఈ ఒక్క రోజైనా ఇంట్లో  ఏ మూలనా చీకటి పడకుండా చూసుకోండి. ఒకవేళ అలా ఎక్కడైనా వెలుతురు పడకుండా ఉంటే అక్కడ ఓ దీపం వెలిగించండి. అలానే, తులసి మొక్క దగ్గర, లక్ష్మీదేవి ముందు కూడా దీపం వెలిగించండి. 
  • ఈ రోజు సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ఉల్లి, వెల్లుల్లి నిషేధం. బ్రహ్మచర్యం పాటించాలి. 
  • ఎవరి పట్లా చెడు ఆలోచనలు చేయకూడదు. కోపం అసలే పనికిరాదు. వీలైనంత వరకూ ప్రశాంతంగా ఉండాలి.
  • అక్షయ తృతీయ నాడు పగటి నిద్ర మంచిది కాదు.
  • ఈ రోజు  ఇంటికి ఎవరైనా అతిధులు వస్తే, వారిని ఖాళీ చేతులతో సాగనంపకండి.

విన్నారు కదా! మనలో చాలామంది తెలిసో, తెలియకో ఇలాంటి తప్పులు చేస్తుంటారు. అలాంటివారు ఇది చదివాక వాటిని సరిదిద్దుకోండి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top