Wednesday, October 5, 2022
spot_img

బ్రహ్మాస్త్ర ట్రైలర్.. విజువల్ ఎఫెక్ట్స్ అదిరిపోయాయ్ (వీడియో)

బాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం బ్రహ్మస్త్ర. హీరో రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా నటిస్తున్న ఈ మూవీ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ రూపొందిస్తున్నారు. సోషియో ఫాంటసీ అడ్వెంచర్ కథతో రూపొందుతున్న ఈ సినిమాను మూడు పార్ట్‏లుగా ప్రేక్షకుల ముందుకు రాబోతునది. ఇందులో మొదటి పార్ట్ లో  శివఅనే పేరుతో విడుదల చేయనున్నారు. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ మూవీ స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్ , స్టార్‌లైట్ పిక్చర్స్ నిర్మిస్తున్నారు. ఇందులో బిగ్ బీ అమితాబ్, మౌనీ రాయ్, నాగార్జున కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ మరింత ఆసక్తిని కలిగించాయి. ఇక ఇటీవల విడుదలైన నాగార్జున, మౌనీ రాయ్ పోస్టర్ మూవీపై మరింత అంచనాలను పెంచేసింది.. ఇక ఇప్పుడు ప్రేక్షకులు ఆత్రుతగా వెయిట్ చేస్తున్న బ్రహ్మస్త్ర ట్రైలర్ రిలీజ్ చేసింది..

నీరు, గాలి, నిప్పు వీటికీ  కొన్ని వందల సంవత్సరాలుగా ఈ శక్తులన్నీ కొన్ని అస్త్రాలలో దాగి ఉన్నాయి.. ఈ కథలో  ఈ అస్త్రాలన్నింటికీ అధిపతి అయిన బ్రహ్మాస్త్రానిది అంటూ చిరంజీవి చెప్పే వాయిస్‏తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. బ్రహ్మాస్త్రం విధి తన అరచేతి రేఖలలో చిక్కుకుని ఉందన్న విషయం తెలియని శివ.. ఈపుడు విడుదలైన ట్రైలర్ ప్రతి సీన్ విజువల్ వండర్ ఎఫెక్ట్‏గా కనిపిస్తోంది. ప్రేమ జంట.. బ్రహ్మాస్త్రాం కోసం చేసెన పోరాటం.. దుష్టశక్తులతొ యుద్ధం.. ఇలా అన్నింటిని కలిపి ట్రైలర్ అద్భుతంగా తీసారు. ఈ అగ్ని నన్ను దహించలేదు అంటూ శివ, ఇషా మధ్య ప్రేమను చాలా బాగా చూపించారు..తాజాగా విడుదలైన ట్రైలర్‏లో సినిమాపై మరింత అంచనాలను పెంచేశారు. ఈ మూవీ తెలుగులో రాజమౌళి సమర్పణలో విడుదల కానుంది. ఇప్పటికే మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ 2022 సెప్టెంబర్ 9న హిందీ తెలుగు కన్నడ తమిళం మలయాళ భాషల్లో విడుదల చేయబోతున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,513FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles