Sammathame Theatrical Trailer

ఆకట్టుకుంటోన్న సమ్మతమే మూవీ ట్రైలర్

టాలీవుడ్ లో టాలెంటెడ్ యంగ్ హీరోలకు కొదవే లేదు. ఈ లిస్ట్ లో కిరణ్ అబ్బవరం ఒకరు. రాజావారు రాణి గారు మూవీతో హీరోగా పరిచయం అయిన కిరణ్ ఆతర్వాత ఎస్ ఆర్ కళ్యాణ్ మండపం మూవీతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు సమ్మతమే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ మూవీలో మరో విభిన్నమైన పాత్రలో అలరించనున్నాడు కిరణ్. గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ మూవీగా రూపొందుతున్న ఈ మూవీలో చాందిని చౌదరి హీరోయిన్ గా సందడి చేస్తుంది. ఈ సినిమాను జూన్ 24న ప్రపంచవ్యాప్తంగా  విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతుండగా గురువారం థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రైట్స్ని సొంతం చేసుకోవడంతో ‘సమ్మతమే’ సేఫ్ హాండ్స్ లోకి వెళ్ళింది.

తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను మంత్రి కేటీఆర్ విడుదల చేశారు. ‘ఏ ఇంటికైనా ఆడపిల్లే మహాలక్ష్మి  వాళ్ళు లేని ఇల్లు ఇలానే ఉంటుంది’ అనే డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభం అయింది. ఈ ట్రైలర్ లో పెళ్లికోసం తాపత్రపడే కుర్రాడిగా కిరణ్ చాల అబ్బవరం కనిపించనున్నాడు. ‘నీకు నీ లైఫ్ లో గోల్ ఇంపార్టెంటా లేకపోతే లైఫ్ లోకి వచ్చే గర్ల్ ఇంపార్టెంటా’ అని హీరోయిన్ అడగ్గా.. ‘నా లైఫ్ లో గోలే  లైఫ్ లోకి గర్ల్ రావడం’ అని హీరో చెప్పడం అందరిని ఆకట్టుకుంది. ఈ మూవీకి సతీష్ రెడ్డి మాసం సినిమాటోగ్రఫీ అందించగా, శేఖర్ చంద్ర మ్యూజిక్ అందించారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top