ఇండో-చైనా బార్డర్ అయిన గల్వాన్ లోయ ఎప్పుడూ వివాదాలకి కేంద్ర బింధువుగా ఉంటుంది. ఇక రీసెంట్ గా గల్వాన్ లోయలో చైనా పతాకం ఎగిరింది. ఇది మరోసారి చైనా కవ్వింపు చర్యగా స్పష్టమవుతుంది.
నూతన సంవత్సరం సందర్భంగా చైనా మరోసారి రెచ్చిపోయింది. కాశ్మీర్ తమదే అని అర్ధం వచ్చేటట్లు సరిహద్దు ప్రదేశమైన గల్వాన్ లోయలో తమ దేశ జెండాని ఎగురవేసిన వీడియో ఒకటి రిలీజ్ చేశారు.
ఈ వీడియోలో గల్వాన్ లోయలోని ఓ నది ఒడ్డున కొందరు చైనా మిలిటరీ నిలబడి ఉన్నారు. వీరిలో ఏడుగురు చైనా జాతీయ జెండాని పట్టుకొని ఉన్నారు. వీరిలో ఒక మహిళ కూడా ఉంది. వీరు ఉన్న ప్రాంతంలో రెయిలింగ్, క్యాంప్‌ల వంటి నిర్మాణాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక ఈ వీడియోని ఓ డ్రోన్ రికార్డు చేసినట్లు తెలుస్తోంది.
అయితే, భారత బలగాలు మాత్రం ఈ వీడియోని ఓ ప్రమోషనల్ వీడియోగా కొట్టిపారేశాయి. పతాకాన్ని ప్రదర్శించిన ప్రాంతం నాన్-మిలిటరీ జోన్ అని తేల్చేశాయి. కేవలం చైనా ఆధీనంలో ఉన్న ప్రాంతంలోనే ఇలా చేశారని తెలిపారు. అంతేకాదు, వివాదాస్పద ప్రాంతం నుంచి 2 కిలోమీటర్ల వెనక్కి వెళ్లాలని గతంలోనే భారత్-చైనా అంగీకరించాయి. కాబట్టి ఇప్పుడా ఛాన్సే లేదు. మరో ముఖ్య విషయం ఏంటంటే, పతాక ప్రదర్శన జరిగిన ప్రాంతంలో కొన్ని నిర్మాణాలు కనిపించాయి. కాబట్టి, ఖచ్చితంగా ఇది చైనా స్థావరమేనని కొట్టి పడేశాయి.