The Real Race between Rabbit and Turtle

ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతున్న కుందేలు తాబేలు రేసు… ఈసారి కూడా తాబేలే గెలిచింది! (వీడియో)

చిన్నతనంలో మనమంతా పంచతంత్రం కథలు చదివే ఉంటాం. అందులో కుందేలు, తాబేలు కథ చాలాసార్లు చదివాం. ఎలాగైనా విజయం నాదేలే! అనే గర్వంతో… కొంతదూరం వెళ్లి… కునుకు తీస్తుంది కుందేలు. కానీ, నిదానమే అయినా పట్టుదలతో ప్రయత్నించి విజయం సాధిస్తుంది తాబేలు. దీనివల్ల ‘Slow and steady wins the race’ అనే మోరల్ మనకి బోధపడుతుంది.

కానీ ఇది చిన్నతనం కాదు, పంచతంత్రం కథ అంతకంటే కాదు, రియల్ లైఫ్ లో ఒక కుందేలు, ఒక తాబేలు మద్య జరిగిన రియల్ రేస్ ఇది. ఈ రేస్ నిర్వాహకులకి ఒక ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు మనం కథల్లో చదువుకున్న విషయాన్ని ఇప్పుడెందుకు నిజం చేయకూడదు అని. అనుకున్నదే ఆలస్యం ఈ రెండిటి మద్య రేస్ స్టార్ట్ చేశారు.

కుందేలు, తాబేలు మధ్య రేసు ఉంటుందని తెలుసు కానీ, హిస్టరీ మళ్ళీ రిపీట్ అవుతుందని ఎవ్వరూ ఎక్స్ పెక్ట్ చేయలేదు. ఈ రేసులో కూడా ర్యాబిట్ టర్టల్ ని స్పీడ్ గా ఓవర్‌టేక్ చేసేసి… సగం దూరం వరకూ వెళ్ళిపోతుంది. కానీ, ఆ తర్వాత ఎందుకో సడెన్ గా ఆగిపోతుంది. కానీ, టర్టల్ మాత్రం స్లో గా మూవ్ అవుతూ… చివరిదాకా వెళ్లి రేస్ ని కంప్లీట్ చేసేస్తుంది. ఇది చూసిన వారందరికీ హిస్టరీ మళ్ళీ రిపీట్ అయినట్లు అనిపించింది. 

అయితే, ఈ ర్యాబిట్, టర్టల్ రేస్ ఇంటర్నెట్ లో తెగ  వైరల్ అవుతోంది. ఈ రేస్ చూసిన నెటిజన్లు తెగ లైకులు, కామెంట్లు పెడుతున్నారు. 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top