నిషా నెత్తికెక్కి… అర్థరాత్రి రోడ్డుకెక్కి…యువతి వీరంగం (వీడియో)

ఫుల్లుగా మందు కొట్టేసింది. ఆపై రోడ్డుకెక్కేసింది. ఇంకేముంది… రచ్చరచ్చ చేసేసింది. ముంబైలో అర్థరాత్రి… తప్పతాగి… ఊగుతూ… తూలుతూ… ఓ మహిళ సృష్టించిన వీరంగం అది. 

నడిరోడ్డుపై కనిపించిన ఏ ఒక్కరినీ ఒదలకుండా దుర్భాషలాడుతూ… నానా హంగామా చేసింది. చివరికి అడ్డు వచ్చిన పోలీసులని సైతం లెక్క చేయకుండా నోటికొచ్చినట్లు తిడుతూ… హల్‌చల్‌ చేసింది. ఆ సమయంలో పక్కనున్నవారు ఎంత వారించే ప్రయత్నం చేసినా వినిపించుకోలేదు.

నిషా నెత్తికెక్కి పోలీసులను, క్యాబ్ డ్రైవర్‌ను, చివరికి రోడ్డుపై వెళ్తున్న పాదచారులను ఇలా ఏ  ఒక్కరినీ విడిచిపెట్టకుండా అందరినీ ఉతికి ఆరేసింది. కనిపించిన వారినందరినీ నోటికొచ్చిన బూతులు తిడుతూ… వారిపై చాలా దురుసుగా ప్రవర్తించింది. 

ముంబైలో ఓ ప్రైవేట్ పార్టీ నుంచి అర్థరాత్రి పూట ఓ ముగ్గురు యువతులు తిరిగి వస్తున్నారు. వీరంతా కలిసి ఓలా క్యాబ్‌లో ప్రయాణిస్తున్నారు. సరిగ్గా ఆ సమయంలోనే ఇదంతా జరిగింది. 

వారిలో విపరీతంగా మద్యం సేవించిన  ఓ  మహిళ రైడ్ సమయంలో క్యాబ్ డ్రైవర్‌పై దుర్భిషలాడింది. చివరికి ఆమె ఆ క్యాబ్ డ్రైవర్‌ను కూడా బయటకు నెట్టేసి, తనే సొంతగా కారును నడిపించింది. 

తర్వాత కారు దిగి అటువైపుగా వెళ్తున్న పాదచారులందరిపై నోరు పారేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని వారించ బోయారు. దీంతో మరింత రెచ్చిపోయిన ఆ మహిళ సదరు లేడీ పోలీస్‌ అధికారిని సైతం కాలర్ పట్టుకుని బెదిరించింది. ఆమె అలా కోపంతో ఊగిపోతూ చేసిన రచ్చంతా క్యాబ్ డ్రైవర్ వీడియో తీస్తూ వచ్చాడు. దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా… అది కాస్తా వైరల్ గా మారింది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top