భారత అమ్ములపొదిలో ఇప్పటి వరకు లెక్కలేనన్ని ఆయుధాలు ఎన్నో ఉన్నాయి. వాటికి తోడు తాజాగా ఇప్పుడు మరికొన్ని ఆయుధాలు వచ్చి చేరాయి. ఈ ఆయుధాల ధాటికి శత్రువు షాక్ కి గురై… అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతాడు. కానీ, అవి ఎలాంటి ప్రాణహాని కలిగించవు.
గల్వాన్ ఘటన తర్వాత ఈ ఆయుధాల రూపకల్పన చేసింది భారత్. బార్డర్ కాన్ఫ్లిక్ట్ లో నాన్ – లెథల్ వెపన్స్ నే వాడాలని ఇరు దేశాల మధ్య ఒప్పందం ఉంది. అందువల్లనే లోయలో ఘర్షణ జరిగినప్పుడు ఇనుపరాడ్లు, ముళ్ల కర్రలనే ఉపయోగించారు. దీనిని దృష్టిలో పెట్టుకొని భారత ప్రభుత్వం ఇప్పుడు సరికొత్త ఆయుధాలను తయారు చేయించింది. ఆ ఆయుధాల ప్రత్యేకత ఏమిటో… అవి ఎలా పనిచేస్తాయో… ఇప్పుడు చూద్దాం.
త్రిశూల్:
త్రిశూలం శివుని ఆయుధం దీనిని స్ఫూర్తిగా తీసుకొనే ‘త్రిశూల్’ అనే వెపన్ ని తయారు చేశారు. ఇది బ్యాటరీ సాయంతో పనిచేస్తుంది. దీనినుంచీ నుంచి విద్యుత్ సరఫరా అవుతుంది. ఈ ఆయుధాన్ని శత్రువుపై ప్రయోగించినప్పుడు శత్రువు దీనిని తాకగానే కొద్దిసేపటివరకూ షాక్‌కి గురువుతాడు.
వజ్ర:
ఇది ఒక ఐరన్ రాడ్. దీనిపై ముళ్లు ఉంటాయి. ఇది బ్యాటరీ సాయంతో నడుస్తుంది. కరెంట్ సప్లై అవ్వడం వల్ల ఈ ఆయుధం అవతలి వ్యక్తిని షాక్ కి గురి చేస్తుంది. దీనివల్ల శత్రువు కొద్దిసేపు అన్ కాన్షియస్ లోకి వెళ్ళిపోతాడు. ఇది కేవలం శత్రు సైనికులపైనే కాదు, వారి వాహనాలపై కూడా దాడి చేసేందుకు ఉపయోగపడుతుంది. ఈ కర్రపై ఉండే ముళ్లు వారి వెహికల్ టైర్లను సైతం పంక్చర్ చేస్తాయి.
సప్పర్ పంచ్:
ఇది అచ్చం చేతికి వేసుకునే గ్లవ్స్ మాదిరిగా ఉంటుంది. దీనిని చేతికి ధరించి శత్రు సైనికుడిని కొడితే… షాక్ వల్ల అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతాడు.
దండ్:
ఇది ఒక ఎలెక్ట్రిక్ స్టిక్. ఇది బ్యాటరీ సాయంతో పనిచేస్తుంది. ఇది పనిచేయడానికి ఒక సేఫ్టీ స్విచ్ అవసరమవుతుంది. ఆ స్విచ్ విడిగా ఉంటుంది. అందుకే, ఒకవేళ శత్రువు దీన్ని తీసుకొని వెళ్లినా దాని స్విచ్ విడిగా ఉండిపోవడం వల్ల దానిని ఉపయోగించలేరు.
భద్ర:
ఇది రాళ్ల దాడులనుంచీ కాపాడే ఒక ప్రొటెక్టివ్ షీల్డ్ లాంటిది. శత్రు సైనికుల రాళ్ల దాడులనుంచీ రక్షించటమే కాకుండా… కళ్ళు మిరుమిట్లుగొల్పే కాంతిని వెదజల్లడం ద్వారా శత్రు సైనికునికి కళ్ళు చెదిరేలా చేస్తుంది.
#WATCH ‘Trishul’ and ‘Sapper Punch’- non-lethal weapons-developed by UP-based Apasteron Pvt Ltd to make the enemy temporarily ineffective in case of violent face offs pic.twitter.com/DmniC0TOET
— ANI (@ANI) October 18, 2021