NASA యొక్క మార్స్ రోవర్ క్యూరియాసిటీ ఒక అస్థిపంజరం యొక్క పక్కటెముకలను పోలి ఉండే ఫోటో తీసింది. అది నిజంగా అస్థిపంజరమేనా..! లేక అలాంటి ఆకారాన్ని సంతరించుకున్న రాళ్ళా..! అని ఇప్పుడు పరిశోధనలు జరుగుతున్నాయి.
మన సౌర వ్యవస్థలో భూమి తర్వాత జీవి మనుగడకి అవకాశమున్న మరో గ్రహం అంగారక గ్రహం. అందుకే అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఇప్పటికే దీనిపై పరిశోధనలు ప్రారంభించింది. నాసాకి చెందిన పర్సీవరెన్స్ అనే రోవర్ అంగారకుడిని అణువణువూ పరిశీలిస్తోంది. మార్స్ పై ఉన్న ప్రతీ దృశ్యాన్ని తన కెమెరాలో బంధిస్తోంది. ఈ క్రమంలోనే రీసెంట్ గా షాకింగ్ ఫోటోలని పంపింది.
అందులో డ్రాగన్ శిలాజాల మాదిరివి అనేకం కనిపిస్తున్నాయి. వాటినుండీ ప్రక్కటెముకలని పోలిన ఆకారాలు మట్టిలోనుంచీ బయటకి వచ్చినట్లు కనిపించాయి. అవి గాలి ద్వారా బహిర్గతమయ్యాయి.
ఈ అద్భుతమైన చిత్రాన్ని ఆస్ట్రోబయాలజిస్ట్ నథాలీ కాబ్రోల్ కనుగొన్నారు. ఆమె ఈ ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ, ఇలా రాసింది: “మార్స్ అన్వేషణలో 20 సంవత్సరాలలో నేను చూసిన అత్యంత అద్భుతమైన రాక్ ఇది.” ఇది బూటకం కాదని నిర్ధారించుకోవాలనుకునే వారు, నాసా వెబ్‌సైట్‌లో ఫోటోను చూడవచ్చు అని.
అయితే అంగారక గ్రహంపై ఉన్న నీటి నుండి అవక్షేపించబడిన సల్ఫేట్‌ల ఎక్కువగా ఏర్పడుతుంది. శాస్త్రీయంగా, ఇటువంటి నిర్మాణాలను ‘డయాజెనెటిక్ క్రిస్టల్ క్లస్టర్‌లు’ అంటారు. ఇవి అనేక విభిన్న ఖనిజాల కలయికతో కూడిన నిర్మాణాలు. ఇది ఇలా ఏర్పడిన సహజ నిర్మాణం అయితే, అటువంటి రాళ్ళు మార్స్ పై చాలా ఉన్నాయి. కానీ ఈ ఫోటో మాత్రం చాలా మందికి వింతగా అనిపించింది. దీనిని పోస్ట్ చేసిన కొద్ది గంటల్లోనే మిలియన్ వ్యూస్ అందుకున్నాయి.
In 20 years of studying Mars, that’s the most bizarre rock I have ever seen. I cannot wait to have a microscopic image of this one…It is part of a Gigapan of Gale crater that you can see here: https://t.co/LxljtDHyIl pic.twitter.com/wHhn1ckqjL
— Nathalie A. Cabrol (@shasta721) April 10, 2023