సైక్లిస్ట్‌పై చిరుత దాడి! చివరికి ఏం జరిగిందో చూడండి!! (వీడియో)

రోడ్డుపై వెళుతున్నప్పుడు సడెన్ గా కుక్క ఎదురొస్తేనే భయపడిపోతాం. అలాంటిది పులి ఎదురొస్తే… ఇంకేమన్నా ఉందా! ఒక్కసారిగా గుండె ఆగినంత పని అయిపోదూ! కానీ, ఇప్పుడు మనం అలాంటి సంఘటనే ఒకటి చెప్పుకుందాం.

అసోంలోని కంజిరంగా నేషనల్ పార్క్ ప్రాంతంలో ఓ ఘాట్ రోడ్డు ఉంది. రహదారికి ఇరువైపులా భారీ వృక్షాలతో అడవిని తలపించేలా ఆ రూట్ ఉంటుంది. ఇక ఆ రోడ్డుపై వాహనాల రాకపోకలు కామనే! 

అయితే, ఓ సైక్లిస్ట్ అటువైపుగా వెళ్తున్నాడు. అతని పక్కనుండే ఓ కారుకూడా వెళ్తుంది.  ఇంతలో పొదలచాటు నుంచి ఓ చిరుతపులి దూసుకొచ్చి… అతనిపై దాడి చేయబోయింది. ఎగిరి అతని నడుం పట్టుకోబోయింది. ఐతే పట్టు తప్పడంతో… చిరుత జారి రోడ్డుపై పడిపోయింది. వెంటనే పొదల్లోకి పారిపోయింది. దాని దెబ్బకి ఆ సైక్లిస్ట్ కూడా బ్యాలెన్స్ తప్పి రోడ్డుపై పడిపోయాడు. 

పులి పంజా నుండీ తప్పించుకొని  కిందపడిన సైక్లిస్టుకి ఒక్కసారిగా గుండె ఆగినంత పనైంది. వెంటనే లేచి, సైకిల్ తీసుకొని ముందుకు వెళ్లకుండా… గబా గబా వెనక్కి వెళ్లిపోయాడు. ఈ సంఘటన అంతా అక్కడి సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. వీడియో పాతదే అయినప్పటికీ, ఇప్పుడు వైరల్ అవుతుంది. 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top