ఇంట్లో ప్రతికూలతని పెంచే పాత చీపురు

ఇంటిని శుభ్రం చేసే చీపురుని లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు. కారణం అది ఇంట్లో ఉండే పాజిటివ్, నెగెటివ్ ఎనర్జీస్ ని ఊడ్చి పడేస్తుంది కాబట్టి. ఇంట్లో నివసించే వారందరినీ వ్యాధుల నుండి రక్షిస్తుంది. ఇంటిని పరి శుభ్రంగా ఉంచుతుంది. మరి అలాంటి చీపురు పాతదైతే, దానిని ఏం చేయాలి? ఎక్కడ పారేయాలి? ఎప్పుడు పారేయాలి? ఇలాంటి విషయాల గురించి చాలా మందికి అవగాహన ఉండదు. 

నిజానికి చీపురు కొనడం, పారేయటం, ఇంట్లో దానిని పెట్టటం ఇలా ప్రతి విషయంలోనూ నియమాలు ఉన్నాయి. ఆ నియమాలు పాటిస్తే… అంతా మేలు జరుగుతుంది. ఒకవేళ పాటించకపోతే అంతా కీడు జరుగుతుంది.  ప్రతి వ్యక్తి వాస్తు ప్రకారం ఈ నియమాలను తప్పక పాటించాలి. 

ఇంట్లో చీపురు పాతదైపోతే, వెంటనే కొత్తది కొంటాము. అయితే, ఆ కొత్త చీపురు కొనడానికి ఒక సమయం ఉంది. మంగళవారం, శనివారం, మరియు అమావాస్య రోజులలో దీనిని కొనుగోలు చేయాలి. 

అలానే, ఇంట్లో చీపురు పెట్టే ప్రదేశం ఎవరూ చూడటానికి వీలులేని విధంగా ఉండాలి. అలాగని అపరిశుభ్ర వాతావరణంలో కూడా చీపురును ఉంచకూడదు. చీపురు ఎక్కడ ఉంచినా ఆ ప్రదేశమంతా పరిశుభ్రంగా ఉండాలి. 

ఇక పాత చీపురును శనివారం, లేదా అమావాస్య రోజు, గ్రహణం తర్వాత, హోలికను దహనం చేసిన తర్వాత  ఇంటి నుండి తీసివేయాలి. ఇంట్లో ఉన్న పాత చీపురుని  తొలగించడం వల్ల ఇంట్లో ఉండే దారిద్రం కూడా తొలగిపోతుంది.

 అయితే ఏకాదశి, గురువారం, శుక్రవారాల్లో ఎప్పుడూ కూడా  పాత చీపురును ఇంటి నుంచి బయటకు విసిరేయకూడదు. ఏకాదశి, గురువారం ఈ రెండు రోజులు నారాయణునికి ప్రియమైన రోజులు. శుక్రవారం లక్ష్మీదేవికి ప్రత్యేకమైన రోజు. కాబట్టి ఈ రోజుల్లో చీపురును ఇంట్లో నుండి తీసేయడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుందని అంటారు. అలాగే, చీపురును ఏదైనా చెట్టు  దగ్గర కానీ, లేదా కాలువ దగ్గర కానీ పడేయకూడదు. అలాగని కాల్చకూడదు. ముఖ్యంగా ఎవరూ తొక్కని ప్రదేశాలలో చీపురును వేయాలి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top