Nasa Shares Stunning Video of Four Saturn's Moons orbiting Saturn

అద్భుతమైన వీడియో: శనిగ్రహం చుట్టూ తిరుగుతున్న చందమామలని క్యాప్చర్ చేసిన నాసా

అమెరికన్ స్పేస్ రీసర్చ్ ఆర్గనైజేషన్ నాసా అప్పుడప్పుడూ అమేజింగ్  వీడియోస్ ని షేర్ చేస్తుంటుంది. అందులో భాగంగా ఇప్పుడు తాజాగా శనిగ్రహం చుట్టూ తిరుగుతున్న చందమామలకి సంబంధించిన వీడియోని షేర్ చేసింది. ఈ అద్భుత వీడియో నెటిజన్లకి తెగ నచ్చేస్తోంది.

మన సోలార్ సిస్టంలో ఉండే గ్రహాల్లో భూమి తర్వాత ఉండే గ్రహాల్లో అత్యంత అందమైనదీ, ఆకర్షణీయమైనదీ ఏదంటే… అది శనిగ్రహమే! దీనికి కారణం దాని చుట్టూ ఉండే భారీ వలయాలే! ఐతే… అప్పుడప్పుడూ నాసా ఈ  శాటర్న్ రింగ్స్ గురించిన వీడియోలని రిలీజ్ చేస్తుంటుంది. ఇప్పుడు తాజాగా శాటర్న్ మూన్స్ గురించిన వీడియో ఒకటి రిలీజ్ చేసింది. ఇందులో చందమామలు శనిగ్రహం చుట్టూ ఎలా తిరుగుతున్నాయో స్పెషల్ గా క్యాప్చర్ చేసింది. 

Also Read: 16సైకీ: ఈ ఉల్క భూమిని చేరితే… ప్రతీ ఒక్కరూ కుబేరులే! (వైరల్ వీడియో)

ఈ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో నాసాకి చెందిన నాసా హబుల్ అకౌంట్‌లో షేర్ చేయటం జరిగింది. ఈ వీడియోలో శనిగ్రహం యొక్క 4 చందమామలు దాని చుట్టూ తిరుగుతున్న దృశ్యం చాలా అద్భుతంగా కనిపిస్తుంది. వీటిలో అత్యంత చల్లగా ఉండే “ఎన్సెలాడస్”, “డియోన్” అనే పేరుగల చందమామలు శనికి ఎడమవైపు ఉండగా… మరో చందమామ “మిమాస్”, మరియు అతి పెద్ద ఆరెంజ్ మూన్ “టైటాన్”, శనికి కుడివైపు ఉన్నాయి అని వివరించింది నాసా.

నిజానికి మన సౌర కుటుంబంలో అతిపెద్ద గ్రహమైన గురుగ్రహానికి 79 చందమామలు ఉండగా… శనిగ్రహానికి అంత కంటే ఎక్కువగా 82 చందమామలు ఉన్నట్లు తేలింది. ప్రస్తుతం మన సౌరకుటుంబంలో ఎక్కువ చందమామలు కలిగి ఉన్నది శనిగ్రహానికి మాత్రమే! 

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top