Nuclear Attack on the Moon

చంద్రుడిపై న్యూక్లియర్ దాడికి సిద్ధపడ్డ అమెరికా

ఒకపక్క చంద్రునిపై మానవాళి సర్వైవ్ అవ్వటానికి కావలసిన రిసోర్సెస్ ఏమైనా ఉన్నాయేమోనని ఎక్స్ ప్లోర్ చేస్తుంటే… మరోపక్క ఆ చంద్రుడ్ని ఓ అగ్ని గోళంలా మార్చటానికి సిద్ధపడింది అమెరికా. అది ఎందుకో… ఏమిటో… ఎప్పుడో… దానికి గల కారణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 

అది 1950ల నాటి మాట. స్పేస్ ఎక్స్ ప్లోరేషన్ లో సోవియట్ యూనియన్ ముందుంజలో ఉన్న రోజులవి. ఆ సమయంలో అమెరికన్ సైంటిస్టులు ఒక విచిత్రమైన ప్లాన్ రూపొందించారు. సోవియట్లను భయపెట్టడానికి మూన్ సర్ఫేస్ ని డిస్ట్రాయ్  చేయాలని ప్లాన్ చేశారు. అందుకోసం ‘ప్రాజెక్ట్ A119’ ని క్రియేట్ చేశారు.

స్టోరీలోకి వెళితే… లియోనార్డ్ రీఫిల్ అమెరికాకు చెందిన పాపులర్ న్యూక్లియర్ ఫిజిసిస్ట్ లలో ఒకరు. ఈయన వరల్డ్స్ ఫస్ట్ న్యూక్లియర్ రియాక్టర్ ఇన్వెంటార్ అయిన ఎన్రికో ఫెర్మీతో కలిసి పనిచేశారు. ఎన్రికో ఫెర్మీని “ఇన్వెంటార్ అఫ్ ది ఆటోమిక్ బాంబ్” అని కూడా పిలుస్తారు. వీరి ఆలోచనకి రూపమే ఈ ప్రాజెక్ట్ A119.

‘ప్రాజెక్ట్ ఏ119’ అనేది చంద్రునిపై అణు బాంబును పేల్చడానికి చేసిన అత్యంత రహస్యమైన ప్రతిపాదన. 1945లో హిరోషిమాపై వేసిన అణుబాంబు కంటే కూడా ఈ హైడ్రోజన్ బాంబులు చాలా ఎక్కువ విధ్వంసకరం. ఆ సమయంలో తయారవుతున్న అణ్వాయుధాల్లోఇవి సరికొత్తవి కూడా.

ప్రాజెక్ట్ ఏ119 యొక్క బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే, అమెరికా తన సత్తా చాటుకోవటం. లూనార్ లైట్ అండ్ డార్క్ నెస్ మధ్య బౌండరీగా ఉన్న టెర్మినేటర్ లైన్‌పై ఈ న్యూక్లియర్ డిటోనేట్ అవుతుంది. సోవియట్ యూనియన్‌కు కళ్లు మిరిమిట్లు గొలిపే కాంతిని వెదజల్లుతూ ఈ విస్ఫోటనం జరుగుతుంది.

1950లలో అమెరికా మరియు  సోవియట్ యూనియన్ ల మద్య కోల్డ్ వార్ జరుగుతుంది. అప్పటి సోవియట్ యూనియన్ నే ఇప్పుడు మనం రష్యాగా పిలుచుకుంటున్నాం. అయితే ఈ వార్ లో అమెరికా  గెలుస్తుందన్న నమ్మకం కనిపించలేదు. అణ్వాయుధాల తయారీలో సోవియట్ యూనియన్ ముందంజలో ఉందని అమెరికా భావించింది.

1952లో అమెరికా మొట్టమొదటి హైడ్రోజెన్ బాంబును టెస్ట్ చేసింది. మూడేళ్ల తరువాత సోవియట్ యూనియన్ తన సొంత న్యూక్లియర్ టెస్ట్ ని జరిపింది. ఇది అమెరికాకు ఆశయాలకు భంగం కలిగించింది.

అంతటితో ఆగకుండా సోవియట్ యూనియన్ 1957లో ‘స్పుత్నిక్ 1’ ని లాంచ్ చేసి స్పేస్ ఎక్స్ ప్లోరేషన్ లో కూడా దూసుకెళ్లింది. ఎర్త్ నుంచి స్పేస్ లోకి వెళ్ళిన ఫస్ట్ ఆర్గిఫిషియల్ శాటిలైట్ ఇదే! అంతేకాక, న్యూక్లియర్ రాకెట్ ని కూడా  అమెరికాపై ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నట్లు  సమాచారం.

ఆ తర్వాత సోవియట్ యూనియన్ ‘కోడ్‌నేమ్డ్ E4’ అనే బాంబును తయారుచేసింది. కానీ, దాన్ని లాంచ్ చేయకుండా ఆపివేసింది. ఎందుకంటే, పొరపాటున ఈ బాంబు ఫెయిల్ అయి సోవియట్ ప్రాంతంలోనే పడితే… తీరని నష్టం కలుగుతుందని భావించి, ప్రయోగాన్ని నిలిపి వేసింది.

ఇదిలా ఉంటే, అమెరికా లాంచ్ చేసిన “ఆర్టిఫిషియల్ మూన్” ఫెయిల్ అయింది. అది స్పేస్ లోకి వెళ్ళకముందే ఎక్స్ ప్లోడ్ అయింది. మరోవైపు సోవియట్ యూనియన్ లాంచ్ చేసిన స్పుత్నిక్ ప్రయోగానికి రివెంజ్ గా ప్రాజెక్ట్ A119 ని రూపొందించి… స్పుత్నిక్‌ను పేల్చేయాలని డిసైడ్ అయింది.

సోవియట్ యూనియన్ చేస్తున్న ఈ న్యూక్లియర్ టెస్టింగ్ వల్ల అనవసర భయాలన్నీ తోడై అమెరికా ఇన్ సెక్యూరిటీ, మరియు డిజప్పాయింట్ మెంట్ తో ఉంది. ఈ భయాన్ని ఆసరాగా చేసుకునే ప్రాజెక్ట్ A119 వంటి టెర్రిబుల్ ప్లాన్ ని రూపొందించింది. కానీ, ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్లాన్ ని అమలు చేయలేదు. 

ఒకవేళ ఆ ప్రాజెక్ట్ A119 ఎగ్జిస్టెన్స్ లోకి కనుక వచ్చి ఉంటే… ఖచ్చితంగా మూన్ పై ఎట్మాస్ ఫియర్ నాశనం అయిపోతుందని శాస్త్రవేత్తలు భయపడ్డారు. ఈ డిస్ట్రక్షన్ టెక్నికల్ గా కూడా సాధ్యమేనని, ఈ  ఎరప్షన్ భూమిపై ఉన్నవారికి కూడా కనిపిస్తుందని తెలిపారు. కానీ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు దీనిని ప్రయోగించలేదు సరి కదా! ఈ విషయాన్ని కూడా ఎంతో గోప్యంగానే ఉంచారు.  

ఫైనల్ గా ట్విస్ట్ ఏంటంటే… ఈ సీక్రెట్ ప్రాజెక్ట్ గురించి 1990ల వరకు ఎవరికి తెలీదు. 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top