సినిమాను మించిన ఛేజింగ్ సీన్ (వీడియో)

రోడ్డుపై వాహనదారులను గుద్దుకుంటూ వేగంగా ముందుకు వెళ్తుంది ఓ మారుతి సుజుకి డిజైర్ కారు. వెనకాలే మరో స్కార్పియో ఆకారుని చేజ్ చేసుకుంటూ దూసుకు వస్తుంది. ఇదంతా ఓ ఇరుకు రోడ్డులో సాగిపోయింది. ఈ దృశ్యాన్ని ఆ ప్రదేశంలో ఉన్న వారంతా విచిత్రంగా చూస్తున్నారు. ఇదేదైనా సినిమా షూటింగేమో అని అనుకున్నారు కూడా.  కానీ కాదు, ఇది రియల్ చేజింగ్ సీన్. ముందుగా కార్లో వెళుతున్నది దొంగలు. వెనుక  స్కార్పియోలో వారిని చేజ్ చేస్తున్నది పోలీసులు. ఇదంతా పంజాబ్ లోని ఫిరోజ్ పుర్ లో జరిగిన రియల్ సీన్. ఈ దృశ్యాలన్ని అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. 

ఇంతకీ పోలీసులు ఆకారును ఎందుకు చేజ్ చేశారో తెలుసా! ఇద్దరు వ్యక్తులు ఆ కారులో హెరాయిన్ ను తీసుకుని వెళ్తున్నారు. అది తెలుసుకున్న పోలీసులు ఆకారులోని వ్యక్తులను పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో వాళ్ళు ఇరుకు రోడ్డులో వేగంగా వెళ్లిపోతుండగా పోలీసులు వారిని వెంబడించారు. ఆ సమయంలో మద్యలో ఒక చోట స్కూటీపై వెళ్తున్న ఓ మహిళను తమ కారుతో ఢీకొట్టి మరీ ఆగకుండా వెళ్లిపోతుంటారు ఆ దొంగలు. ఇంతలో  వెనకనుంచీ ఓ  పోలీసు తుపాకితో కారు టైర్ పై కాల్పులు జరిపాడు. అయినా ఆగకుండా అంతే స్పీడుతో ముందుకెళ్ళి పోయింది ఆకారు. 

ఆ సమయంలో వెనకాల వాహనంలో ఉన్న పోలీసు తుపాకితో కారు టైర్ పై కాల్పులు జరిపాడు. అయినా ఆగకుండా అక్కడి నుంచి మరికొంత దూరం కారులో ముందుకెళ్లిపోయారు. తర్వాత ఒక పోలీస్ దిగి ఆ కారు వెంట పరిగెత్తసాగాడు. చివరికి ఎట్టకేలకి పోలీసులు ఆ దొంగలని పట్టుకున్నారు. ఆ కారు మొత్తం  సోదా చేయగా పది గ్రాముల హెరాయిన్ ని పట్టుకున్నారు పోలీసులు. దొంగలైతే దొరికారు కానీ, పాపం పోలీసులు వారి కోసం పది కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వచ్చింది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top