సముద్రంలోనే పేలిన అణుబాంబు… అగ్ని పర్వతం లావాలా పైకి ఎగజిమ్ముతున్న నీరు! (వీడియో)

అణుబాంబు అనగానే ముందుగా మనకి గుర్తొచ్చేది హిరోషిమా, నాగాసాకి పట్టణాలు. ఆగష్టు 6, 1945 న జపనీస్ నగరం హిరోషిమాపై అమెరికా అణుబాంబు వేసింది. ఆ సమయంలో నగరం నడిబొడ్డున బాంబు పేలడంతో ఒక్కసారిగా ఉష్ణోగ్రత మిలియన్ డిగ్రీల సెంటీగ్రేడ్‌కు చేరుకుంది. దీంతో హిరోషిమా జనాభాలో 2 లక్షల 50 వేల మంది వరకు కాల గర్భంలో కలిసిపోయారు. కేవలం ఓకే ఒక్క క్షణంలోనే ఇదంతా జరిగిందంటే… ఆ అణుబాంబు పవర్ ఏమిటో మీరు ఊహించవచ్చు. 

అణుబాంబు ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన ఆయుధాలలో ఒకటి. ఇది సృష్టించే విధ్వంసం అంతా ఇంతా కాదు. ఒక్క అణుబాంబు చాలు మొత్తం నగరాన్నే నాశనం చేయటానికి. అందులో అంత శక్తి దాగి ఉంటుంది. అయితే, అదే అణుబాంబు సముద్రంలో పేలితే ఎట్లుంటుందో ఒక్కసారి ఊహించుకోండి.  ఇంకేముంది నీటి అడుగున అగ్ని పర్వతం బద్ధలయినట్లే!

సరిగ్గా ఇలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుందిప్పుడు. ట్విట్టర్ లో తరచూ ఎన్నో వీడియోలు సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. కానీ ఈ వీడియో మాత్రం ఇప్పుడు నెటిజన్లని విపరీతంగా ఆకర్షిస్తుంది. ఆ వీడియో 63 ఏళ్ల క్రితం సముద్రంలో అణుబాంబు పరీక్షించినప్పటిది.

1958వ సంవత్సరంలో ఈ సంఘటన జరిగింది. ఆ సమయంలో నీరు చాలా నిశ్శబ్దంగా ఉంది. ఒక్కసారిగా సముద్రం లోపలినుంచీ భారీ శబ్దంతో నీరు ఆకాశాన్ని తాకేలా ఎగిసిపడుతుంది. ఒక్క క్షణం అది నీరు కాదు, మేఘమేమో అనిపిస్తుంది. ఆకాశంలోకి వెళ్ళేకొద్దీ నీరంతా దూదిపింజలా కనిపించింది. దీనంతటికీ కారణం ఒక టెస్ట్ లో భాగంగా సముద్రపు అడుగున అణుబాంబును పేల్చటమే! 

ఈ పరీక్షను అమెరికా చేసింది.  ఇది కేవలం ఓ చిన్న అణు బాంబే అయినప్పటికీ, శక్తి మాత్రం విపరీతం. ఈ టెస్ట్ కి అమెరికా ‘వహూ’ అనే కోడ్ నేమ్ ఇచ్చింది. మార్షల్ ఐలాండ్స్ లో ఈ పరీక్ష జరిగింది.  సముద్రం కింద దాదాపు 500 అడుగుల లోతులో ఈ అణుబాంబు అమర్చారు. కానీ అది పేలినప్పుడు, సముద్రం పైనే పేలినట్లు అనిపించింది. చుట్టూ ఎక్కడ చూసినా పొగ మాత్రమే కనిపించింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు, చాలా షాక్‌ అవుతున్నారు.

https://twitter.com/TheFigen/status/1553039353580064769?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1553039353580064769%7Ctwgr%5Ed77b0b44ab192fa91af941bca21ea86e948cbcbe%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Ftv9telugu.com%2Ftrending%2Fnuclear-bomb-explosion-underwater-shocking-video-au42-756597.html

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top