బెగుసరాయ్ జిల్లాలోని ఓ ప్రాంతంలో… దుండగులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. దీంతో అక్కడి స్థానికులంతా భయంతో ఒణికిపోయారు. అదికూడా మరెక్కడో కాదు, పట్టణంలోనే అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో.
బీహార్‌లోని బెగుసరాయ్ పట్టణంలో మల్హిపూర్ చౌక్ వద్ద మోటార్ సైకిళ్లపై వచ్చిన ఇద్దరు దుండగులు ఒక్కసారిగా కాల్పులు విచక్షణా రహితంగా జరిపారు. అనుకోకుండా జరిగిన ఈ పరిణామానికి అక్కడి స్థానికులంతా తీవ్ర భయాందోళనకి గురయ్యారు. ఏం జరిగిందో ఏంటో అర్థంకాక ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు తీశారు. దుకాణదారులు సైతం తమ దుకాణాలని ఒదిలేసి పారిపోయారు. ఈ కాల్పుల్లో ఒక వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. మరో పదకొండు మంది తీవ్రంగా గాయపడ్డారు.
పోలీసులు తెలిపిన కధనాల ప్రకారం… బెగుసరాయ్ పట్టణంలో… సాయంత్రం 5 గంటల ప్రాంతంలో… దుకాణాలను లక్ష్యంగా చేసుకుని ముష్కరులు ఈ కాల్పులు జరిపారు. ఆ తర్వాత బరౌనీ థర్మల్ చౌక్, బరౌనీ, తేఘ్రా, బచ్వారా, రాజేంద్ర బ్రిడ్జి వంటి ప్రాంతాలలో కూడా ప్రజలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ అల్లర్లలో ఓ 30 ఏళ్ల వ్యక్తి మృతి చెందగా, మరో 11 మంది గాయాల పాలయ్యారు. ఈ సంఘటనతో పాట్నా అప్రమత్తమైంది. కానీ ప్రజలు వారిని సైకో కిల్లర్లుగా పిలుస్తున్నారు.
Mass shooting being reported in #Begusarai, one killed and 8 people injured. pic.twitter.com/KVsc5gyUUh
— Nikhil Choudhary (@NikhilCh_) September 13, 2022