Tiger Grabs Mahindra Xylo by its Teeth

మహీంద్రా కార్లు ఎంత రుచికరంగా ఉంటాయో…ఈ పులికి కూడా తెలుసు అంటున్న ఆనంద్ మహీంద్రా (వీడియో)

మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారన్న విషయం తెలిసిందే! తరచూ అయన షేర్ చేసే  వీడియోలకి సామాన్యులు సైతం స్పందిస్తుంటారు. ఇక  అప్పుడప్పుడూ టాలెంటెడ్ పీపుల్ ని ఎంకరేజ్ చేస్తూ… వారికి గిఫ్ట్స్ కూడా ప్రకటిస్తుంటారు. ఈ నేపద్యంలో ఆయనకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.   

ఇక రీసెంట్ గా ఆనంద్ మహీంద్ర ఓ వీడియో షేర్ చేశారు. అందులో, సఫారీ కోసం వెళ్తున్న మహీంద్రా గ్జైలో కారుని ఓ టైగర్ ఎటాక్ చేస్తుంది. కారు వెనుక ఉండే బంపర్‌ని నోటితో గట్టిగా పట్టుకొని కొరకటం మొదలుపెడుతుంది. కొద్దిసేపటి తర్వాత నోటితోనే కారుని లాగిపడేసింది. దీంతో ఆ కారులో ఉన్న వారంతా భయంతో హడలెత్తి పోయారు.

ఏమాత్రం చప్పుడు చేయకుండా అందరూ ఒదిగి కూర్చుండి పోయారు. పులి ఏ మాత్రం వెనక్కి తగ్గేదే లేదు అన్నట్లుగా ఆ కారుని చీల్చే ప్రయత్నం చేసింది. ఈ దృశ్యాన్నంతా మరో కారులో ప్రయాణిస్తున్న వారు తమ కెమెరాల్లో క్యాప్చర్ చేశారు. ఇదంతా బెంగళూరు సమీపంలోని బన్నెరఘట్ట నేషనల్ పార్క్‌లో గల ఊటీ-మైసూర్ రోడ్ లో చోటు చేసుకుంది.

People experiencing the mysterious hum sound heard on Earth, unexplained low-frequency noise
భూమిపై రహస్య శబ్దం – ఎవరికీ అర్థం కాని హమ్ సౌండ్

ఈ వీడియోని షేర్ చేస్తూ మహేంద్ర ఏమన్నారంటే… “పులి ఆ కారుని కొరకడంలో నేనేం ఆశ్చర్య పోవడం లేదు. బహుశా ఆ పులి కూడా మహీంద్రా కార్లు డిలీసియస్ అనే నా అభిప్రాయాన్ని పంచుకున్నట్లుంది.’’ అంటూ క్యాప్షన్ పెట్టారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top