Air Disasters, Worst Plane Crashes

Top 10 Worst Air Disasters in History

మనిషి తన జీవిత కాలంలో చేసే జర్నీస్ అన్నిటిలో ఫ్లైట్ జర్నీని మించింది మరొకటి లేదు అనుకొంటాడు. అందుకే, ఈ మోడ్రెన్ వరల్డ్ లో ఇదో పార్ట్ గా మారింది. ఈ బిజీ లైఫ్ స్టైల్ లో లాంగ్ డెస్టినేషన్స్ ని కుడా కేవలం కొద్ది గంటల్లోనే రీచ్ అవ్వొచ్చు. ఈ కారణంగానే ఎక్కువమంది దీనినే ప్రిఫర్ చేస్తున్నారు. అయితే ఫ్లైట్ జర్నీ ఎంతో సేఫెస్ట్ జర్నీ అయినప్పటికీ, ఒక్కోసారి ఇవి కుడా ప్రమాదాలకి గురవుతుంటాయి. అలాంటి వాటిలో వరల్డ్స్ మోస్ట్ వరస్ట్ ఏవియేషన్ డిజాస్టర్స్ గురించి ఈ రోజు ఈ ఆర్టికల్ లో క్లియర్ గా తెలుసుకుందాం, 

హిండెన్‌బర్గ్ డిజాస్టర్ (1937)

హిండెన్‌బర్గ్ ఎయిర్‌షిప్ లగ్జరీ అండ్ ఇన్నోవేషన్స్ కి ఐకాన్ గా ఉండేది. ఇది మే 6, 1937లో, న్యూజెర్సీలో ల్యాండ్ అవటానికి ట్రై చేసినప్పుడు ఘోర వైఫల్యాన్ని ఎదుర్కొంది.  తుఫాను కారణంగా ఆ రోజు మధ్యాహ్నం నుండీ విపరీతమైన గాలులు వీస్తున్నాయి. సాదారణంగా ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ గాలికంటే తేలికగా ఉండటంతో ఆ ప్రదేశంలో గాలులు మరింత  ప్రమాదకరంగా మారతాయి. దీంతో ఎమెర్జెన్సి ల్యాండింగ్ ని ఎనౌన్స్ చేసింది ఎయిర్ స్టేషన్. 

సాయంత్రం సరిగ్గా 7 గంటల :25 నిముషాలకి తుఫాను కారణంగా  లేక్‌హర్స్ట్ నేవల్ స్టేషన్ ని రీచ్ అయి… ల్యాండ్ అవుతుండగా… హిండెన్‌బర్గ్ టెయిల్ ఫిన్‌ లో ఫ్లేమ్ రావటం గమనించారు సిబ్బంది. క్షణాల్లోనే, ఆ మంటలు టెయిల్ భాగాన్ని పూర్తిగా చుట్టుముట్టి వేగంగా ముందుకు వ్యాపించాయి. హిండెన్‌బర్గ్ యొక్క టెయిల్ పార్ట్ భూమిని తాకకముందే మిడ్-సెక్షన్ కి మంటలు అందుకున్నాయి. తర్వాత కేవలం 34 సెకన్లలోనే ఈ ఎయిర్‌షిప్ పూర్తిగా మంటల్లో కాలిపోయింది. ఈ ప్రమాదంలో 36 మంది ప్రాణాలు కోల్పోయారు. 

ఈ డిజాస్టర్ ఏవియేషన్ సెక్టార్ లోనే సిగ్నిఫికెంట్ చేంజ్ ని తీసుకువచ్చింది. ఎందుకంటే, ఇది ప్యాసింజర్స్ సేఫ్ గా ఉండేలా డిజైన్ చేయబడలేదు. ముఖ్యంగా ఇది అత్యంత వేగంగా మండే హైడ్రోజన్ గ్యాస్ తో ఫిల్ చేయబడి ఉంది. అందుకే, హిండెన్‌బర్గ్ వంటి ఎయిర్‌షిప్‌లను ఉపయోగించడం మానేశారు.  ఆ తర్వాత తక్కువగా మండే హీలియంని ఉపయోగించి విమానాలని తయారు చేయడం ప్రారంభించారు. అయితే, హైడ్రోజన్ గ్యాస్ లీక్ వల్లనే మంటలు వ్యాపించాయని అందరూ భావించినప్పటికీ, విపత్తుకు కారణం ఇప్పటికీ వివాదాస్పదంగానే ఉంది.

జపాన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 123 క్రాష్ (1985)

జపాన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ క్రాష్ ని ‘మౌంట్ ఒసుటాకా ఎయిర్‌లైన్ డిజాస్టర్’ అని కూడా అంటారు. జపాన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 123 అనేది జపనీస్ డొమెస్టిక్ ఎయిర్‌లైన్స్. ఇది టోక్యో యొక్క హనెడా ఎయిర్ పోర్ట్ నుండి జపాన్‌లోని ఒసాకా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కి ట్రావెల్ చేయడానికి షెడ్యూల్ చేయబడిన పాసింజర్స్ ప్లేన్. 

ఈ ఫ్లైట్ ఆగష్టు 12, 1985న, టోక్యో నగరం నుండీ బయలుదేరి 24,000 అడుగుల ఎత్తుకు చేరుకుంది. అంతలో డీకంప్రెషన్‌కి గురైంది. తర్వాత 32 నిమిషాల తర్వాత, పర్వతాలపై కూలిపోయింది. ఈ ప్రమాదంలో 505 మంది ప్రయాణికులు, 15 మంది సిబ్బంది మరణించారు.  ఈ ప్రమాదానికి కారణం కొన్నేళ్ళ క్రితం రిపేర్ చేసిన వెనుక ప్రెజర్ బల్క్‌హెడ్ పగిలటమే!

దీనిని గమనించిన పైలట్… కంటిన్యూగా సిగ్నెల్స్ ని పంపుతూనే ఉన్నాడు. టోక్యో ఎయిర్ పోర్ట్ కి రూట్ డైవర్ట్ చేయమని కోరాడు. కానీ, అంతలోనే మౌంట్ ఒసుటాకా సమీపంలోని మౌంట్ తకమగహారాలో కూలిపోయింది. అందుకే ఈ విపత్తుకు ఆ పేరు వచ్చింది.

పాన్ యామ్ ఫ్లైట్ 103 (1988)

పాన్ యామ్ ఫ్లైట్ 103 ఎక్స్ ప్లోడ్ అనేది ఏవియేషన్ హిస్టరీలోనే మోస్ట్ ట్రాజిక్ ఇన్సిడెంట్. డిసెంబరు 21, 1988న, ఎప్పటిలానే పాన్ యామ్ ఫ్లైట్ 103, ఫ్రాంక్‌ఫర్ట్ నుండి డెట్రాయిట్ వెళ్లే రూట్ లో బయలుదేరింది. ఇది స్కాటిష్ టౌన్ లోని లాకర్‌బీ అనే ప్రాంతానికి చేరుకోగానే ఒక్కసారిగా ఎక్స్ ప్లోడ్ అయింది.  పొలిటికల్ రివేంజ్ కారణంగా టెర్రరిస్టులు ఇందులో బాంబు పెట్టటం జరిగింది. ఈ బాంబు దాడిలో 270 మంది ప్రాణాలు కోల్పోయారు. 

ప్రయాణికులు మరియు సిబ్బందికి తెలియకుండా ముందుగానే ఫ్లైట్ కార్గో హోల్డ్‌లో టైమ్ బాంబ్ సెట్ చేయటం జరిగింది. ఫ్లైట్ టేకాఫ్ అయిన తర్వాత కేవలం 38 నిమిషాలకే, బాంబ్ బ్లాస్ట్ అయింది. ఫలితంగా ఎన్నో జీవితాలను ఛిద్రం చేసింది. అందుకే దీనిని ‘లాకర్బీ బాంబింగ్’ ఇన్సిడెంట్ అని కూడా అంటారు. దీని ఇంపాక్ట్ భూమిపై మాత్రమే కాకుండా విమానయాన పరిశ్రమ అంతా పడింది. ఈ కారణంగా విమానయాన భద్రతలో విపరీతమైన మార్పుని  ప్రేరేపించింది.

ఇది కూడా చదవండి: Top 15 Most Dangerous Places on Earth

ఎయిర్ ఫ్రాన్స్ ఫ్లైట్ 447 (2009)

ఎయిర్ ఫ్రాన్స్ ఫ్లైట్ 447 డిజప్పియరెన్స్ అనేది ఏవియేషన్ హిస్టరీలోనే మోస్ట డిస్టర్బింగ్ మిస్టరీ. ఇది రియో డి జెనీరో నుండి పారిస్‌కు ఒక సాధారణ ప్రయాణంగా ప్రారంభమైనది. జూన్ 1, 2009న అట్లాంటిక్ ఓషన్ దగ్గరికి వచ్చేటప్పటికి వ్యానిష్ అయిపోయింది. ఇందులో ట్రావెల్ చేస్తున్న 228 మంది ప్యాసింజర్స్ కూడా  డిజప్పియర్ అయిపోయారు. 

నిజానికి ఈ ఫ్లైట్ డిజప్పియర్ అవటానికి అక్కడున్న ఎక్స్ ట్రీమ్ వెదర్ కండిషన్స్, టెక్నికల్ ఎర్రర్స్, మరియు హ్యూమన్ మిస్టేక్స్ వంటివి కారణాలు. దీని ఫలితంగా ఎయిర్‌క్రాఫ్ట్ సిస్టమ్స్ ఇంప్రూవ్ అయ్యాయి.  పైలట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా ఇంప్రూవ్ అయ్యాయి. 

మలేషియా ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 370 (2014) 

మలేషియా ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 370 అని పిలువబడే బోయింగ్ 777 జెట్ మోస్ట్ మిస్టీరియస్ మిస్సింగ్ ప్లేన్స్ లో ఒకటి. ఇది మార్చి 8, 2014న, కౌలాలంపూర్ నుండి బీజింగ్‌కి బయలుదేరింది. అర్దరాత్రి దాటిన తర్వాత సౌత్ చైనా ఓషన్ పై నుండీ ట్రావెల్ చేస్తూ… నార్త్ ఈస్ట్ కి టర్న్ అయింది. ఇక ఆ తర్వాత నుండీ ఇప్పటివరకూ కనిపించలేదు. 

ఈ సంఘటన ఎయిర్‌క్రాఫ్ట్ ట్రాకింగ్ సిస్టమ్‌పై అనేక రకాల చర్చలకు దారితీసింది. ఎన్నో రకాలుగా ఎక్స్ ప్లోరేషన్ చేపట్టారు. కానీ ఫ్లైట్ ఆచూకీ మాత్రం ఎక్కడా లభించలేదు.  దీని ప్రభావంతో ఎయిర్‌క్రాఫ్ట్ పొజిషన్ రిపోర్టింగ్ మరియు రియల్ టైమ్ ట్రాకింగ్‌కు సంబంధించి రెగ్యులేటరీ చేంజెస్ కి దారితీసింది. 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top