What Caused the Batagaika Crater

భూమిపై ఏర్పడ్డ బ్లాక్ హోల్

విశ్వంలో బ్లాక్ హోల్స్ ఏర్పడటం అనేది సర్వ సాదారణమైన విషయమే! కానీ అలాంటి బ్లాక్ హోల్స్ మన భూమిపై ఏర్పడితే…

బ్లాక్ హోల్స్ భూమిపై ఏర్పడాలంటే మన భూగోళం బఠానీ గింజంత పరిమాణంలోకి మారిపోవాలి. మరి ఈ బ్లాక్ హోల్ ఏమిటి అని మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే టాపిక్ ‘బటగైకా క్రేటర్’ గురించి. 

నిజానికి ఇది బ్లాక్ హోల్ కానప్పటికీ, బ్లాక్ హోల్ ఎలాగైతే దాని చుట్టుపక్కల ఉన్న నక్షత్రాలన్నిటినీ తనలోకి లాగేసుకుంటుందో… ఈ బటగైకా క్రేటర్ కూడా దాని చుట్టుపక్కల ఉన్న భూమినంతా తనలోకి లాగేసుకుంటుంది.

ప్రపంచంలోనే అతిపెద్ద శాశ్వత మంచు బిలంగా చెప్పబడే ఈ బటగైకా క్రేటర్ రష్యా యొక్క ఫార్ ఈస్ట్‌లోని సఖా రిపబ్లిక్‌లోని వెర్కోయాన్స్కీ జిల్లాలో ఉంది. దీనిని అక్కడి స్థానికులు ‘నరకపు నోరు’ (mouth to hell) అని పిలుస్తారు. సైంటిఫిక్‌గా దీనిని బటగైకా క్రేటర్ అంటారు. 

Bodhidharma's disappearance, mysterious Buddhist legend
Unraveling the Mystery of Bodhidharma’s Disappearance

1960కి ముందు ఈ లోయ ఉన్న ప్రాంతంలో… దట్టమైన అడవి ఉండేదట. 1960 తర్వాత ఆ అడవి కనుమరుగై పోయింది. నేల మాత్రమే మిగిలింది. సూర్యుడి కిరణాలు డైరెక్టుగా ఇక్కడ పడటం మొదలైంది. దాంతో… ఆ నేల కరిగి ఇలా గొయ్యి ఏర్పడటం మొదలైనట్లు తెలుస్తోంది. సైంటిస్టులు అయితే ఇలాంటి మరిన్ని లోయలు త్వరలో ఏర్పడవచ్చని అంటున్నారు. కారణం భూతాపం. 

ప్రస్తుతం నరకపు నోరు అని చెప్పుకోబడే ఈ లోయ.. సంవత్సరానికి 20 నుంచి 30 మీటర్లు పెరుగుతోంది. ఇది ఇప్పట్లో ఆగేలా లేదు. భవిష్యత్తులో ఇంకా ఎంత సైజ్ పెరుగుతుందో కూడా తెలియదు. శాటిలైట్ ఇమేజెస్‌లో దీనిని చూస్తే… కప్పపిల్ల (tadpole) ఆకారంలో కనిపిస్తుంది.

1980లో 282 అడుగుల లోతు ఉన్న ఈ లోయ చూడటానికి చాలా చిన్నగా ఉండేది. కాలం గడిచేకొద్దీ దీని సైజ్ పెరుగుతోంది. ఇప్పుడు ఇది 1 కిలోమీటర్ పొడవు ఉంది. ఈ లోయ చుట్టూ ఉన్న ప్రదేశం రాను రానూ గొయ్యిలా అయిపోతోంది. దీనిని ‘మెగా-స్లంప్’ అని పిలుస్తారు. 

సైంటిస్టులేమో… ఈ లోయ చుట్టూ ఉన్నది కరిగిపోయే భూమి అంటున్నారు. ఎప్పుడో 25.8 లక్షల సంవత్సరాల క్రిందట  ఈ భూమి గడ్డకట్టినట్లు అయ్యిందట. అందుకే ఈ క్రేటర్ అనేది థర్మోకార్స్ట్ డిప్రెషన్, ఇది శాశ్వత మంచును కరిగించడం వల్ల ఏర్పడే పతనం. దీనికి సమీపంలో  బటగాయ్కా నది ఉండటంతో దీనికి ఆ పేరు పెట్టారు.

The Dark Side of Dubai, Human Rights Concerns
Dubai’s Hidden Poverty

ఇక వానాకాలంలో అప్పుడప్పుడూ ఈ లోయ నుంచి భారీ శబ్దాలు కూడా వినిపిస్తాయట. ఈ లోయ దగ్గర నివసించే  యాకుత్ జాతి ప్రజలను ఇది భయపెడుతోందట. వారికి భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారింది. నరకానికి వెళ్లేందుకు ఈ లోయే మార్గం చూపిస్తుందని వారు నమ్ముతున్నారు. 

చివరిమాట: 

ఏది ఏమైనా నానాటికీ ఈ లోయ పెరుగుతూ… తన చుట్టూ ఉన్న భూమిని లోపలికి లాగేసుకుంటోంది. అందుకే భూమిపై  ఇదో రకమైన బ్లాక్ హోల్ అనుకోవచ్చు. భవిష్యత్తులో ఇలాంటి బ్లాక్ హోల్స్ ఇంకా ఎన్ని చూస్తామో కదా! 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top