భూమిపై ఎన్నో రహశ్యాలు రహశ్యాలుగానే మిగిలిపోతున్నాయి. సైంటిస్టులకి సైతం అర్ధం కాని చిక్కు ప్రశ్నలుగా మిగిలిపోతున్నాయి. అలాంటి వాటిలో ‘ఫొస్సే డియొన్నే’ ఒకటి. ఇది ఫ్రాన్స్‌లోని బర్గుండీలో ఉంది.
ఆ ప్రాంతంలో కొన్ని శతాబ్దాలుగా భూమినుండీ నీరు ఊరుతూనే ఉంది. ఏ ఒక్క రోజూ కూడా ఆ నీటి ఊట ఆగలేదు. అయితే, ఆ నీరు ఎక్కడి నుంచి వస్తోంది? భూమి పైకి ఎలా వస్తోంది? కారణం ఏంటన్నది ఎవరికీ తెలియట్లేదు. అందుకే ఇది ఇప్పటికీ ఓ మిస్టరీగా మారిపోయింది.
భూగర్భం నుండీ సెకండ్‌కి 311 లీటర్ల నీరు ఊట రూపంలో పైకి వస్తుంది. అది చుట్టుప్రక్కల ప్రాంతమంతా ప్రవాహంలా కొనసాగుతోంది. అంతేకాదు, ఆనీరు కూడా రంగులు మారుతూ ఉంటుంది. ఒకవేళ భూమి లోపలినుంచీ ఆ నీరు వస్తున్నట్లైతే… మరి ఆ నీటికి సోర్స్ ఎక్కడుంది? అనేదే వీడని మిస్టరీగా ఉంది. ఈ నీటి ఊట చుట్టూ… 18వ శతాబ్దంలో ఓ భవనం లాంటి దాన్నినిర్మించారు. ఇక ఈ నీటిపై ఆదారపడి ఇక్కడో గ్రామం జీవిస్తోంది.
రోమన్లు ఈ నీటినే తమ అవసరాలకు ఉపయోగిస్తున్నారు. తాగు నీరుగా మాత్రమే కాకుండా సాగునీరుగా కూడా ఉపయోగపడుతుంది. మొత్తమీద ఈ నీటినైతే ఉపయోగిస్తున్నారు కానీ, దాని లోపలికి వెళ్లే సాహసం మాత్రం ఎవరూ చేయలేక పోతున్నారు. కారణం దీని లోపలి వెళ్ళిన వారంతా చనిపోతున్నారు. దీని లోపల ఏదో భయంకరమైనది ఉందని అంటున్నారు.
ఈ నీటి ఊటకు సంబంధించి ఓ ఆసక్తికరమైన కథ ఉంది. పూర్వం ఇక్కడో సన్యాసి నివసిస్తూ ఉండేవాడట. అతనికి తినటానికి చుట్టుపక్కల అడవుల్లో పండ్లు, ఫలాలు అయితే దొరికేవి గానీ… నీరు దొరికేది కాదు. అందుకే నీటికోసం తన శక్తినంతా ఉపయోగించి ఇక్కడో ఊట గొయ్యిని తవ్వాడట. ఎంతకీ నీరు బయటికి రాకపోయేసరికి తన కోసం కాకపోయినా… స్థానికుల కోసమైనా నీరు కావాలని ప్రార్ధిస్తూ… తనను తాను అర్పించుకొన్నాడట. దాంతో ఒక్కసారిగా ఇక్కడ నీరు ప్రవాహంలా పైకి వచ్చిందని చెబుతారు. అయితే ఇది ఎప్పుడు జరిగిందో ఎవరికీ తెలియదు.
శాస్త్రవేత్తల అంచనా ప్రకారం, దీని చుట్టుపక్కల ఉన్న పీఠభూమనిలోపల భారీగా సున్నపురాతి పొరలు ఉన్నాయి. ఆ పొరల్లో వర్షపు నీరు వెళ్లి చేరి గడ్డకడుతోంది. అది సంవత్సరమంతా కరుగుతూ… నీటి ఊట రూపంలో బయటకు వస్తోంది. ఇలా ఎప్పుడూ ఆ సున్నపురాతి పొరలలో నీరు స్టాక్ ఉంటోంది. నీటి ఊటకు కారణం అదే అయి ఉండవచ్చని అభిప్రాయ పడుతున్నారు.
చివరి మాట:
ఏదేమైనా కానీ సైంటిస్టులకి కూడా అర్ధం కానీ ఈ భూగర్భ నీటి ఊట దాని చుట్టుప్రక్కల నివసించే ఎంతోమందికి దాహం తీరుస్తుంది.