Unsolved Mysteries of Sphinx

సృష్టి రహస్యం స్పింక్స్ లో దాగుందా..?

ఈజిఫ్టులోని పిరమిడ్ల గురించి తెలిసిన వారందరికీ స్పింక్స్ గురించి కూడా తెలిసే ఉంటుంది. ఈజిప్ట్ లోని అతి పెద్ద పిరమిడ్ అయిన గిజా పిరమిడ్ దగ్గర ఉండే మనిషి తల… సింహం శరీరంతో ఉండే భారీ విగ్రహమే ఈ స్పింక్స్.

నిజానికి స్పింక్స్ లో ఓ రహస్యం దాగి ఉంది. అది బయటపడితే… భూమిపై లైఫ్ పూర్తిగా మారిపోతుంది. ఆ రహస్యం బయటపడాలంటే… ఈ విగ్రహం క్రింద ఉన్న గదులని తెరవాల్సి ఉంటుంది. వాటిని తెరిచే ప్రత్యేక మెకానిజం దాని చెవిలోనే ఉంది. అంటే స్పింక్స్ చెవి లోపల ఎక్కడో అ గదులు తెరవటానికి పనికొచ్చే కీ దాగి ఉందన్నమాట. 

స్పింక్స్ ఓ జంతువు లాగానో, పక్షి లాగానో, లేదంటే మనిషి లాగానో ఉంటే ఎవరికీ ఆశ్చర్యం కలిగేది కాదు. కానీ విచిత్రంగా దీనికి మనిషి తల, సింహం శరీరం, తోక, గద్ద రెక్కలు ఉన్నాయి. అందుకే దీనిని ఏ విధమైన జీవిగా పేర్కొనాలో అర్ధం కావట్లేదు. 

గ్రీకు పురాణాల ప్రకారం, గ్రీస్ లోని థేబ్స్ పట్టణాన్ని శిక్షించేందుకు దేవుళ్లు స్పింక్స్‌ని పంపించారని, ఇది అలా భూమిపైకి వచ్చిందని అంటారు. గ్రీక్ భాషలో స్పింక్స్ అంటే… బంధించేది, లేదా పిండేసేది అనే అర్థం వస్తుంది. స్పింక్స్‌ ఎత్తు 65.6 అడుగులు; పొడవు 240 అడుగులు. ఇక్కడ లభించే భారీ సున్నపురాయితోనే ఈ విగ్రహాన్ని  చెక్కారు. అయితే, ఇది ఎప్పుడూ సూర్యుణ్ని చూస్తున్నట్లు ఉంటుంది. దీన్ని క్రీస్తుపూర్వం 2,500 కాలంలో నిర్మించినట్లు తెలుస్తోంది.

చరిత్ర కారులు దీనిని ఈజిప్టు ఫారో ఖాఫ్రే కోసం నిర్మించినట్లు చెప్తారు. ఈజిప్షియన్లు సూర్యుడ్ని తమ దైవంగా భావించి కొలుస్తుంటారు. అందుకే సూర్యునికి సేవలు చేసేందుకు దీనిని నిర్మించారని చెప్తుంటారు. కానీ, ఇది ఎంతవరకూ నిజమో ఎవరికీ తెలియదు.  దీని గురించి ఎలాంటి ఆధారమూ లేదు. కానీ, గిజా పిరమిడ్ దగ్గర అనుబిస్ అనే పదం మాత్రం రాసి ఉంది. అనుబిస్ అంటే ఈజిప్ట్ భాష‌లో స్పింక్స్ అని అర్ధం. అందుకే, స్పింక్స్ నే అనుబిస్ అని అంటుంటారు. 

ఇతీవిలి కాలంలో స్పింక్స్ ముఖమంతా ఎవరో చెక్కేసినట్లు ఉంది.  బాడీపై కూడా చాలా గీతలు పడినట్లు కనిపిస్తుంది. దీనికి కారణం వాతావరణంలో వచ్చిన మార్పులు, మరియు గాలుల వల్లే అని పురాతత్వవేత్తలు భావించారు. కానీ, ఓ జియాలజిస్ట్ మాత్రం అవి భారీ వర్షాల వల్ల వచ్చినవని తెలిపారు. 

ఆ ప్రకారం చూస్తే, క్రీస్తుపూర్వం 2500 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో భారీ వర్షాలే లేవని తెలుస్తుంది. అయితే దీనికి కారణం నిజంగా వర్షాలే అయితే, గిజా పిరమిడ్, అలానే మిగతా పిరమిడ్లపై కూడా ఇలాంటి గీతలు పడి ఉండాలి కదా! కానీ, మిగతా వేటికీ ఈ గీతలు లేవు. కాబట్టి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.   

ఇక స్పింక్స్ కింద ఓ రహస్య గది ఉంటుంది. దాన్ని ‘రికార్డుల గది’ అంటారు. అందులో అట్లాంటియన్ల నాగరికత విజ్ఞానం, మరియు మానవ జాతికి సంబంధించిన సృష్టి రహస్యాలున్నాయి. మరింత లోతుకి పరిశీలించి చూస్తే, స్పింక్స్ కింద మరికొన్ని చక్కటి గదులు ఉన్నట్లు తెలిసింది. ఆ గదుల్లో భారీగా నిధి నిక్షేపాలు ఉండొచ్చనే అభిప్రాయం కూడా ఉంది.

అలాగే, స్పింక్స్ ముందు తవ్వకాలు జరిపి చూడగా, అక్కడ ఎర్ర రంగులో ఉన్న గ్రానైట్ రాయి కనిపించింది. వాస్తవానికి అక్కడ సున్నపు రాయి కనిపించాలి. కానీ, అక్కడ అలా జరగలేదు. కాబట్టి ఈ ప్రాంతం లోపలి భూమిలో ఏదో ఉంది అని నిర్దారణకి వచ్చారు. 

చివరి మాట:

గిజా పిరమిడ్ వయసు 4,500గా చెప్తుంటారు. మరి స్పింక్స్‌ ని అంతకంటే ముందే నిర్మించారా! లేక తర్వాత నిర్మించారా! అనేది పరిష్కారం దొరకని మిస్టరీగా మారింది.  ఇక ఇలాంటి జీవులు భూమికి ప్రాతినిధ్యం వహిస్తున్నాయనే వాదన కూడా ఉంది. ఇక ఈ విగ్రహాన్ని అంట్లాంటియన్లు నిర్మించారా లేదా అన్నది కూడా ఖచ్చితంగా తెలియదు. ఏది ఏమైనా… ఈ విగ్రహం మానవాళికి విచిత్రమైన అనుభూతిని మిగులుస్తోంది. అలాగే, పర్యాటకుల్ని బాగా ఆకర్షిస్తోంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top