What does Numerology say about 2024

2024 గురించి న్యూమరాలజీ ఏం చెబుతోంది?

న్యూమరాలజీ ప్రకారం, ప్రతి సంవత్సరం దాని స్వంత శక్తిని కలిగి ఉండే ప్రత్యేకమైన యూనివర్శల్ నెంబర్ ఒకటి ఉంటుంది.  2024లో ఆ సంఖ్య 8. ఈ సంఖ్య మన జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుంది? మరియు వాస్తవానికి దాని అర్థం ఏమిటి? ఇలాంటి విషయాల గురించి ఈ రోజు ఈ ఆర్టికల్ లో చర్చించుకుందాం. 

చాలా మంది 8 ని విక్టరీ సింబల్ గా చెబుతుంటారు. ఈ సంఖ్య విజయం, మరియు శక్తిని పుష్కలంగా అందిస్తుందని అంటారు.  అలాగే, ఈ సంఖ్య మెటీరియలైజేషన్, మరియు మ్యానిఫెస్టేషన్ యొక్క పవర్ ని కలిగి ఉంటుంది. అందుకే, ఇది కొన్ని ముఖ్యమైన లక్షణాలు కలిగి ఉంటుంది.

2024 సంవత్సరం న్యూమరాలజీ  యొక్క ప్రాముఖ్యత

2024 సంవత్సరం 2, 0, 2, 4 సమ్మేళనంగా ఉంది. అందుచేత ఈ సంఖ్యలో పుట్టిన వారందరికీ వారి స్వంత ఎనర్జీ, సింబాలిజం, మరియు యునిక్యూ క్వాలిటీస్ ఉంటాయి. అలా కాకుండా, ఈ నెంబర్స్ అన్నిటినీ యాడ్ చేసినప్పుడు 8 అవుతుంది. కాబట్టి ఈ నెంబర్ యొక్క ఇంపార్టెన్స్ ఏమిటో ఇప్పుడు చూద్దాం. 

నెంబర్ 2: 

ఈ నెంబర్ చంద్రుడిని సూచిస్తుంది. 2024 సంవత్సరంలో  2 అనే అంకె రెండుసార్లు ఉంటుంది కాబట్టి ఇది డబ్బు, పని, ఉద్యోగం, సమృద్ధి, ద్రవ్య లాభాలు, భావోద్వేగాలు, భావాలను తెస్తుంది.

నెంబర్ 4: 

ఈ నెంబర్ రాహువుతో సంబంధం కలిగి ఉంటుంది కాబట్టి ఇది కొత్త టెక్నాలజీ, కొత్త ఆలోచనలు, ఆకస్మిక లాభాలు మరియు కొత్త అవకాశాలను తెస్తుంది. 

నెంబర్ 8:

ఈ నెంబర్ శనికి అంకితం చేయబడింది. కాబట్టి ఇది కృషి, కర్మ, పని, కర్మ ఫలితాన్ని చూపుతుంది. 

సమృద్ధి:

ఈ యూనివర్శల్ ఇయర్ 8లో మరిన్ని ఆర్థిక అవకాశాలు మరియు శ్రేయస్సు ఉండవచ్చు. ఈ ఏడాదంతా శ్రద్ధగా పనిచేసి తెలివైన ఆర్థిక ఎంపికల నుండి పెద్ద ప్రతిఫలాలను పొందే సమయం.

నాయకత్వం:

8వ సంఖ్య సిట్యువేషనల్ మేనేజ్‌మెంట్ మరియు నాయకత్వ సామర్థ్యంతో ముడిపడి ఉంటుంది. ఇది నాయకత్వ పాత్రలను స్వీకరించడానికి మరియు మన స్వంత జీవితాలకు బాధ్యత వహించడానికి  ప్రేరేపిస్తుంది.

కర్మ:

8 సంఖ్య కర్మ ఆలోచనతో బలంగా సంబంధం కలిగి ఉంటుంది. మనం చేసే పనులకు సానుకూల మరియు ప్రతికూల ప్రభావాలు రెండూ ఉన్నాయని ఇది రిమైండర్‌గా పనిచేస్తుంది. ఈ సంవత్సరం, సమతుల్య, నైతిక జీవితాన్ని గడపడం మరియు మంచి కర్మలను ఆకర్షించడానికి మంచి ఎంపికలు చేయడంపై మీ దృష్టిని పెట్టండి.

ఆశయం:

8 అంకె యొక్క శక్తి మన లక్ష్యాలను చేరుకోవాలనే సంకల్పాన్ని మరియు ఆశయాన్ని ఇస్తుంది. మీ లక్ష్యాలను చేరుకోవడానికి అవసరమైన కృషిని మరియు అధిక లక్ష్యాన్ని సాధించాల్సిన సమయం ఇది.

బాధ్యతలు:

8వ సంవత్సరం అవకాశాలను అందించినప్పటికీ, ఇది ఇబ్బందులు మరియు బాధ్యతలను కూడా కలిగిస్తుంది. అందుకే ఉన్న రిసోర్సెస్ ని పరిమితంగా వాడుకోవాలి. మరియు అతిగా ప్రవర్తించడం మానుకోవడం చాలా కీలకం.

చివరి మాట:

కాబట్టి మొత్తంగా 2024 సంవత్సరం సమృద్ధి, కర్మ, పని, డబ్బు, ఉద్యోగాలు మరియు వృత్తి పరంగా ప్రజలకు అదృష్టాన్ని కలిగించే 8 సంఖ్య యొక్క కలయిక. కాబట్టి అందరూ ఈ సంవత్సరాన్ని సద్వినియోగం చేసుకోవాలని అనుకుంటున్నాను.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top