What Happens if an Astronaut Dies in Space?

స్పేస్‌లో వ్యోమగామి చనిపోతే వాళ్ళ బాడీ ఏమౌతుంది..? (వీడియో)

యావత్‌ ప్రపంచం స్పేస్ ట్రావెల్ చేయడానికి సిద్ధపడుతున్న రోజులివి. అంతేకాక, మార్స్ పై గ్రీన్ హౌస్ ఏర్పాటుకి ఎలాన్ మాస్క్ భారీ ప్రణాళికలే రూపొందించాడు. ఈ క్రమంలో స్పేస్ లివింగ్ ఎలా? అనే విషయంపై ఆలోచించాల్సిన పరిస్థితులు వచ్చేస్తున్నాయి. 

ఇదిలా ఉంటే… సాదారణంగా స్పేస్ రీసర్చ్ కోసం వెళ్ళే వ్యోమగాములు వారు  తిరిగి భూమిపైకి వచ్చేదాకా అక్కడి వాతావరణానికి అనుకూలంగా ఉండే విధంగా స్పేస్ సూట్ ధరించి వెళతారు. అయితే, స్పేస్ లో దిగినప్పుడు వీరికి సరిపడా ఆక్సిజన్ లభించక… అక్కడి వాయువులకి వీరి శరీరం అనుకూలించక పోయినప్పుడు ఒక్కసారిగా వీళ్ళు చాలా గందరగోళానికి గురవుతారు. 

ఆ సమయంలో  స్పేస్ లో ఉండే చిన్న చిన్న ఆస్ట్రాయిడ్స్  వీరిని ఢీ కొంటాయి. దీంతో వారి స్పేస్ సూట్ కి రంధ్రాలు పడతాయి. దీనివల్ల వ్యోమగామి గతి తప్పి… అడ్డదిడ్డాలుగా తిరుగుతుంటాడు.  కేవలం 10 సెకన్లలోనే వారి రక్తంలో నీరు ఆవిరి అయిపోతుంది. శరీరం గాలితో నిండిన బెలూన్ లాగా ఉబ్బి పోతుంది.

అప్పటికీ 15 సెకన్ల వరకూ స్పృహలోనే ఉంటాడు. సరిగ్గా 30 సెకన్లలో ఊపిరితిత్తులు కుప్పకూలిపోయి… పక్షవాతానికి గురవుతారు. 90 సెకన్ల తర్వాత ఊపిరాడక మరణం సంభవిస్తుంది.

A Wall-Like Giant Structure was seen on Mars
మార్స్ పై కనిపించిన భారీ గోడ… ఇది ఏలియన్స్ పనేనా..?

అయితే భూమిపై మరణించిన వ్యక్తి శరీరం దశలవారీగా కుళ్లిపోతుంది. కానీ, అంతరిక్షంలో చనిపోయిన వ్యక్తి శరీరం పూర్తిగా కుళ్ళిపోదు. కారణం మార్స్ పై ఉన్న పొడి వాతావరణమే!

ఆస్ట్రోనట్ స్పేస్‌ సూట్‌ ధరించి ఉన్నప్పటికీ… లోపల బాడీ మొత్తం బిగుసుకోనిపోతుంది. పేగుల్లో ఉండే బ్యాక్టీరియా… మృత కణజాలాన్ని తినేస్తుంది. కాకపోతే ఇక్కడ ఆక్సిజన్ తక్కువ కాబట్టి ఈ ప్రకియ నిదానంగా సాగుతుంది.

భూమిలో పాతిపెట్టిన డెడ్ బాడీని కుళ్ళిపోవటానికి సూక్ష్మజీవులు  సాయపడతాయి. కానీ, ఇతర గ్రహాల్లో అలా జరగదు. ముఖ్యంగా మార్స్ పై ఉండే పొడి వాతావరణం… శరీరంలోని మృదు కణజాలాన్ని ఎండిపోయేలా చేస్తుంది. ఇక గాలివాటుగా వచ్చే అవక్షేపాలు… బాడీని క్షీణింపచేస్తాయి. 

అయితే స్పేస్ లో ఉండే వాతావరణం, ఉష్ణోగ్రత, గురుత్వాకర్షణలని బట్టి మృతదేహం అనేక రకాల మార్పులకు లోనవుతుంది. ఇక కుళ్లిపోయినా  వాసన రాకుండా ఉండేందుకు శవాన్ని స్పేస్‌సూట్‌లోనే ఉంచి… స్పేస్ షిప్ లో ఐస్ క్రిస్టల్స్ పై ఫ్రీజర్ చేస్తారు. అలా చేయటం వల్ల డెడ్ బాడీ చాలా పెళుసుగా మారుతుంది. బాగా పెళుసుగా మారిన ఎముకలు ఒకానొక ప్రక్రియలో చిన్న చిన్న ముక్కలుగా విరిగి పోతాయి. ఆ ఎముకలనుండీ వచ్చిన బూడిదని మాత్రమే స్పేస్ షిప్ తిరిగి భూమిపైకి తీసుకొని వెళ్తుంది.

World's Largest Iceberg Move After 37 Years
37 ఏళ్ల తర్వాత కదులుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద ఐస్‌బర్గ్… మానవాళికి తీరని ముప్పు!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top