ప్రపంచంలో మొట్టమొదటిసారిగా గాల్లో ఎగిరే బైక్‌ వచ్చేసింది! (వీడియో)

0
8
World's First Flying Bike

మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా మనం కూడా మారాలన్నదే నేటి సిద్ధాంతం. ఫ్యూయల్ వెహికల్స్ నుండీ… గ్యాస్ వెహికల్స్… వాటినుండీ ఎలక్ట్రిక్‌ వెహికల్స్… వాటినుండీ ఫ్లయింగ్‌ వెహికల్స్… ఇలా రోజు రోజుకీ టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతుంది. 

మొదట ఫ్లయింగ్‌ వెహికల్స్ అంటే ఎయిర్ క్రాఫ్ట్స్ మాత్రమే ఉండేవి. రీసెంట్ గా ఫ్లయింగ్‌ కార్స్ కూడా వచ్చి చేరాయి. ఇక ఇప్పుడు ఫ్లయింగ్‌ బైక్స్ కూడా తోడయ్యాయి. 

ప్రపంచంలో మొట్టమొదటిసారిగా గాల్లో ఎగిరే బైక్‌ వచ్చేసింది. దీనిని జపాన్‌కి చెందిన ‘అలీ టెక్నాలజీస్‌’ కంపెనీ రూపొందించింది. ఈ బైక్  గంటకి 100 కిలోమీటర్ల వేగంతో దూసుకు వెళ్తుంది. దాదాపు అరగంట పాటు గాల్లోనే చక్కెర్లు కొడుతుంది. 

ఇప్పటివరకూ రోడ్డుపై నడిచే బైక్… ఇప్పుడు గాల్లో నడుస్తుందంటే… ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. అక్కడైతే ఏ ట్రాఫిక్ కంట్రోల్ ఉండదు. ఏ సిగ్నల్స్ ఆపవు. 

ఈ బైక్‌ బరువు 300 కిలోలు.  దీని పొడవు 3.7 మీటర్లు, వెడల్పు 2.4 మీటర్లు, ఎత్తు 1.5 మీటర్లు. పెట్రోల్‌తోనే పని చేస్తుంది. అయితే ఎలక్ట్రిసిటీ ద్వారా గాల్లో ఎగురుతుంది. ప్రస్తుతానికి పైలట్‌ ఒక్కడే కూర్చోగలడు. అక్టోబర్‌ 26 నుండి బుకింగ్‌ మొదలైంది. అయితే, లిమిటెడ్‌ ఎడిషన్స్ కి మాత్రమే! 2025 నాటికి పూర్తి స్థాయిలో ఇవి అందుబాటులోకి రానున్నాయి.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here