టాలెంట్ ని ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తుంటారు నెటిజన్లు. ఈ కోవకి చెందినదే ఇప్పుడు ఈ వీడియో కూడా. తాజాగా ఓ యువతి చేసిన డాన్స్ కి అంతా ఫిదా అయిపోతున్నారు. అది కూడా మాములుగా కాదు, శారీలో స్టెప్స్ వేసింది. ఇంకేముంది కుర్రాళ్ళ హార్ట్ బీట్ పెంచేసింది.
ఆ యువతి పేరు శ్రిష్. Sriiishh పేరుతో ఆమెకి ఇన్‌స్టాగ్రామ్‌లో ఎకౌంట్ ఉంది. వృత్తి రీత్యా ఆర్టిస్ట్, యూట్యూబర్, మరియు డేటా విజార్డ్. సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఈమె తన వీడియోస్ షేర్ చేస్తూ ఉంటుంది. అలాగే, డిసెంబర్ 4న కూడా ఓ వీడియో తన ఇన్స్టాలో షేర్ చేసింది. ఆ వీడియో బాలీవుడ్ స్టార్ సారా అలీఖాన్ యొక్క అప్‌కమింగ్ మూవీ ‘అత్రంగీ రే’ చిత్రంలోది. అందులో ఆమె నటించిన చకా చక్ సాంగ్‌కి స్టెప్స్ వేసింది.
అయితే ఈ వీడియో ఇంతలా వైరల్ అవ్వటానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి ఆమె డాన్స్ పెర్ఫార్మెన్స్, డ్యాన్స్ కి తగ్గట్టుగా ఆమె మూమెంట్స్, మరియు ఆమె ఫేస్ ఎక్స్ ప్రెషన్స్ సింక్ అవటం అయితే… రెండవది 4.4 మిలియన్ ఫాలోయర్స్ ఉండటం. అందుకే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.
View this post on Instagram