Eternal Flame Falls Mystery

జలపాతం వెనక ఆరని దీపం… మిస్టరీగా మారిన ప్రదేశం (వీడియో)

సాదారణంగా ఎలాంటి దీపమైనా నీరు తగిలితే ఆరిపోతుంది. కానీ, ఈ దీపం మాత్రం ఏకంగా ఒక జలపాతం కిందే ఉంది. అది కూడా ఏళ్ల తరబడి ఆరకుండా అలా వెలుగుతూనే ఉంది. ఈ మిస్టీరియస్ ప్లేస్ ని చూడటానికి ప్రతిరోజూ ఎంతోమంది ఇక్కడికి వచ్చి వెళుతున్నారు. కానీ, ఎవ్వరికీ దీని రహశ్యం అంతుచిక్కట్లేదు.

ఈ ప్రపంచంలో ఉన్న ఎన్నో అంతుచిక్కని రహశ్యాలలో ఈ ఎటర్నల్ ఫ్లేమ్ ఫాల్స్ కూడా ఒకటి. ఈ మిస్టీరియస్ ప్లేస్ అమెరికాలోని న్యూయార్క్ నగరానికి పశ్చిమాన ఉన్న చెస్ట్‌నట్ రిడ్జ్ పార్క్ దగ్గర ఉండే ‘షేల్ క్రీక్ ప్రిజెర్వ్’ అనే ప్రదేశంలో ఉంది. ఇక్కడ నిరంతరం జాలువారే జలపాతం ఉంది. ఈ జలపాతం వెనుక ఎప్పటికీ ఆరిపోకుండా వెలిగే దీపం ఒకటి ఉంది. 

నిజానికి ఈ ఫ్లేమ్ చాలా చిన్నదిగానే ఉంటుంది. కానీ, కంటిన్యూయస్ గా వెలుగుతూనే ఉంటుంది.  ఇది ఎందుకలా వెలుగుతుందో ఎవ్వరికీ తెలియదు. అదే ఫ్లేమ్ మన దేశంలో ఉండి ఉంటే… ఖచ్చితంగా ఈపాటికి అక్కడ ఓ గుడి కట్టేసేవాళ్ళు. కానీ, విదేశాలలో ఉండటం వల్ల దీనిని ఒక టూరిస్ట్ స్పాట్ గా మార్చేశారు. 

ఎప్పుడైతే ఈ దీపం విషయం తెలిసిందో… అప్పటినుండీ ఈ ప్లేస్ పై  మీడియా ఫోకస్ చేసింది. దీంతో ఈ వింతని చూడటానికి పెద్ద సంఖ్యలో జనాలు వచ్చిపోతున్నారు. ఈ విషయం తెలిసి అక్కడి గవర్నమెంట్ దీనిని టూరిస్ట్ స్పాట్ గా మార్చేసింది.

క్రమక్రమంగా ఈ స్పాట్ బాగా పాపులర్ అయింది. దీంతో సైంటిస్టులు దీనిపై రీసర్చ్ చేయటం స్టార్ట్ చేశారు. వారి రీసర్చ్ లో ఓ షాకింగ్ పాయింట్ తెలిసింది. అదేంటంటే, ఈ జాలువారే నీటి కింద ఉండే బండరాయి కింద ఉండే భూమికి ఓ చిన్న హోల్ ఏర్పడి ఉంది. ఆ హోల్ లోపల సుమారు 1,300 అడుగుల కింద మీథేన్, ఈథేన్, ప్రోపేన్ వాయువులు బయటకు వస్తున్నాయని. ఈ వాయువులకి స్వతహాగానే మండే స్వభావం ఉండటం వల్ల… అక్కడ నుండీ గ్యాస్ బయటికి వస్తుంది. ఈ కారణంగానే అక్కడ దీపం వెలుగుతున్నట్లు తేలింది.

అయితే, ఇక్కడో ట్విస్ట్ ఉంది. ఈ ఫ్లేమ్ నిజంగా గ్యాస్ వల్ల ఏర్పడిందే అయితే… ఎప్పుడూ ఒకే పరిమాణంలో ఉండదు. అలానే, అప్పుడప్పుడూ వెలుగుతూ, ఆరిపోతూ ఉండాలి. కానీ, ఇక్కడ అలా జరగట్లేదు, ఈ దీపం ఎప్పుడూ ఒకే పరిమాణంలో ఉంటుంది. అలాగే, ఆరకుండా కంటిన్యూయస్ గా వెలుగుతూ ఉంది. అందుకే, ఈ ఎటర్నల్ ఫ్లేమ్… ఇప్పటికీ మిస్టరీగా మారిపోయింది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top